జూలై‌ చివరి నాటికి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలు పూర్తి చేస్తాం

ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌

పోలవరం: పోలవరం ప్రాజెక్టును దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభిస్తే.. ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి చేస్తారని ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. పోలవరం ప్రాజెక్టును డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పరిశీలించారు. నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న ఇళ్లను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ఐదేళ్ల పాలనలో నిర్వాసిత కుటుంబాలకు చంద్రబాబు చేసిందేమీ లేదని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు అంటే కాపర్‌ డ్యామ్‌ రెండు కాల్వలు తవ్వడం కాదని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసిత కుటుంబాలను ఆదుకోవాలని, సీఎం వైయస్‌ జగన్‌ చర్యలు చేపట్టారన్నారు. పోలవరం ప్రాజెక్టు వైయస్‌ఆర్‌ ప్రారంభిస్తే ఆయన తనయుడు సీఎం వైయస్‌ జగన్‌ పూర్తిచేస్తారన్నారు. పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. జూలై చివరి నాటికి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలు పూర్తి చేసి 15 వేల కుటుంబాలను తరలిస్తామని, మనసున్న నేత మా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. 
 

Back to Top