రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్‌ 8వ జాతీయ మెగా కన్వెన్షన్‌కు సీఎంకు ఆహ్వానం

తాడేప‌ల్లి: రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్‌ 8వ జాతీయ మెగా కన్వెన్షన్‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని మ‌హాసంఘ్ ప్ర‌తినిధుల బృందం ఆహ్వానించింది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌హాసంఘ్ ప్ర‌తినిధుల బృందం సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి ఆగస్టు 7న తిరుపతి ఎస్వీ స్టేడియంలో జ‌ర‌గ‌నున్న‌ నేషనల్‌ మెగా కన్వెన్షన్ ఆహ్వాన‌ప‌త్రిక‌ను అంద‌జేసింది. 

ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వనించిన వారిలో ఆల్‌ ఇండియా బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ జస్టిస్‌ వి.ఈశ్వరయ్య, రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్‌ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ బాబారావు తైవాడే, జనరల్‌ సెక్రటరీ సచిన్‌ రాజుర్కర్, వైస్‌ ప్రెసిడెంట్స్‌ జాజుల శ్రీనివాస్‌ గౌడ్, కేశన శంకరరావు ఉన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు.

2016 నుంచి ప్రతి ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాష్ట్రీయ ఓబీసీ మ‌హాసంఘ్‌ కన్వెన్షన్‌లు నిర్వహించింది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఓబీసీలకు సంబంధించిన అనేక కీలక డిమాండ్‌లు, పరిష్కారంపై మెగా కన్వెన్షన్‌లో చర్చించనున్నారు. 

Back to Top