దుర్గాదేవి శరన్నవరాత్రులకు సీఎం వైయస్‌ జగన్‌కు ఆహ్వానం

తాడేపల్లి: విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రికి ప్రసాదాలు అందజేసి, దుర్గాదేవి శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రభుత్వం తరఫున  పట్టువస్త్రాలు సమర్పించాల్సిందిగా సీఎం వైయస్‌ జగన్‌ను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి ఈవో భ్రమరాంబ, ఎండోమెంట్స్‌ ముఖ్య కార్యదర్శి వాణిమోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 

అదే విధంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి దేవ‌స్థానం దసరా ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా సీఎం వైయస్‌ జగన్‌ను ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో దేవాదాయ శాఖ మంత్రి, టీటీడీ చైర్మ‌న్‌తో పాటు శ్రీశైలం దేవస్ధానం ఈవో లవన్న ఉన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top