వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత

ఇంటర్నేషనల్ టైగర్స్ డే కార్యక్రమంలో  సీఎం వైయ‌స్ జగన్  

తాడేప‌ల్లి: వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాలయంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ టైగర్స్ డే కార్యక్రమం నిర్వ‌హించారు. పులుల దినోత్సవం సందర్భంగా 63 పులుల చిత్రాలతో రూపొందించిన పుస్తకాన్ని, పోస్టర్లను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆవిష్కరించారు.. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ.. అడవుల్లో స్వేచ్ఛగా జీ వించడం వన్యప్రాణుల హక్కని, వాటి స్వేచ్ఛా జీ వితానికి ఆటంకం కలిగించడం, వేటాడడం పెద్ద నేరమన్నారు. ఇటీవల  పులులు సంచరించడం అ డవుల సంరక్షణ వృద్ధికి శుభసూచకమన్నారు. కార్య‌క్ర‌మంలో  అటవీ, పర్యావరణశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్‌  చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్ ఎన్‌ ప్రతీప్‌ కుమార్, అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శి విజయ్‌కుమార్, పలువురు ఉన్నతాధికారులు  పాల్గొన్నారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top