తాడేపల్లి: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో దివ్యాంగుల విభాగం ఆధ్వర్యంలో దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బందెల కిరణ్‌రాజ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ.. 2016నాటి దివ్యాంగుల చట్టాన్ని చంద్రబాబు ప్రభుత్వం విస్మరిస్తే, వైయస్ జగన్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమంతో పాటు, ఆ హక్కుల చట్టాన్ని పక్కాగా అమలు చేసిందని వెల్లడించారు. అందుకే వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో దివ్యాంగులు ఆత్మగౌరవంతో తలెత్తుకు తిరిగారని వారు గుర్తు చేశారు. పార్టీ అధికార ప్రతినిధి కొమ్మూరి కనకారావు, పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ దొడ్డా అంజిరెడ్డి, పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర నాయకులు చల్లా రామయ్య, ఆవుల నాగేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.