అనంతపురం: విలువలు, విశ్వసనీయతే లక్ష్యంగా రాజకీయాల్లో ఆదర్శనేతగా ఎదిగిన వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నాయకులకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన స్ఫూర్తితో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చిట్లూరి బీసీ రమేష్ గౌడ అంతర్జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. బుధవారం (19న) దుబాయ్‌లోని అట్లాటీస్ ` దిఫాం జుమేరియాలో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో బీసీ రమేష్ గౌడ్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్-లండన్ సంస్థ ఇంటర్నేషనల్ ఎక్సలెన్సీ అవార్డును అందుకున్నారు. వివిధ రంగాలలో అసమానమైన ప్రతిభా పాటవాలను కనపరిచే వ్యక్తులను గుర్తించి వారి సేవలను కొనియాడుతూ.. దుబాయ్ కేంద్రంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్-లండన్ సంస్థ ఈ ఇంటర్నేషనల్ ఎక్సలెన్సీ అవార్డులను అందజేసింది. ఈ ఏడాది విశ్వవ్యాప్తంగా 88 మంది వ్యక్తులు, సంస్థలు చేసిన సేవలను మననం చేసుకుంటూ, అవార్డులకు ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాయలసీమ జోనల్ ఇన్‌చార్జ్, అనంతపురం జిల్లా టాస్క్‌ఫోర్స్ సభ్యులు బీసీ రమేష్ గౌడ్ ఒక్కడే ఈ అవార్డుకు ఎంపిక కావడం గమనార్హం. ఈ సందర్భంగా ముఖ్యఅతిథులు మాట్లాడుతూ.. రమేష్‌గౌడ్ రాజకీయ నాయకునిగా ఉంటూ సామాజిక సేవను తనవంతు కర్తవ్యంగా భావించి సేవలందించడం అభినందనీయం. నిరుపేదలకు వైద్య సహాయం కోసం ఆర్థిక ఆసరా కల్పించడం.. నిరుపేద విద్యార్థులు తమ చదువులను కొనసాగించడానికి వీలుగా వివిధ రూపాలలో ఆర్థిక భరోసా ఇవ్వడం.. కులమతాలకతీతంగా వృద్ధాశ్రయాలలో సేవలు అందించడం, కరోనా సమయంలో నిత్యవసర సరుకులు, అన్నం ప్యాకెట్లు అందించడంలో బీసీ రమేష్ గౌడ్ ముందు వరుసలో ఉన్నారని చెప్పవచ్చు. ఈ సామాజిక సేవలకు గుర్తింపుగా వ్యక్తిగత విభాగంలో ఇంటర్నేషనల్ స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. రాజకీయ నాయకుడి కంటే ముందుగా సామాజిక కార్యకర్తగానే రమేష్‌గౌడ్ ప్రజలకు సేవ చేయడం జీవిత పరమార్ధంగా మలుచుకోవడం జరిగింది. ప్రధానంగా నిరుపేదలకు బట్టలు పంపిణీ చేయడం, నిర్భాగ్య రోగులకు మంచి నాణ్యతతో కూడిన మందులను, ఆహార పొట్లాలను అందించడమే కాకుండా.. పూట గడవని నిర్భాగ్యులకు నిత్యావసర సరుకులను అందించి పట్టెడు అన్నం తినిపించడంలో బీసీ రమేష్ గౌడ్ తన విద్యుక్త ధర్మాన్ని చాటుకోవడం జరుగుతుంది. అదే సమయంలో తన చురుకైన సామాజిక సేవ నిర్ణయాలతో రాజకీయ రంగంలో కూడా బీసీ రమేష్ గౌడ్ తనదైన ముద్ర వేసుకున్నారు. డైనమిక్ లీడర్‌గా.. వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్ఫూర్తితో రమేష్ గౌడ్ నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ పార్టీలో యువతను చురుకైన కార్యకర్తలుగా పని చేసే విధంగా తీర్చిదిద్దడంలో మార్గదర్శిగా నిలిచారు. రాజకీయ రంగంలో ఆయన సేవలను ప్రశంసిస్తూ.. తాము వరల్డ్ బుక్ ఆప్ రికార్డ్-లండన్ సంస్థ ప్రదానం చేసే ఇంటర్నేషనల్ ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు. విద్యార్థి దశ నుంచే రాజకీయ నాయకత్వ లక్షణాలను బీసీ రమేష్ గౌడ్ పుణికి పుచ్చుకున్నారని, అదే ఒరవడితో ఒక డైనమిక్ లీడర్‌గా ఎదిగారన్నారు. అదే సమయంలో సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సామాజిక కార్యకర్తగా బీసీ రమేష్ గౌడ్ పరితపించే తపన మాటల్లో చెప్పలేనిదని.. అనంతపురం జిల్లాకు చెందిన బీసీ రమేష్ గౌడ్.. అంతర్జాతీయ సంస్థ ప్రశంసలు అందుకున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జోనల్ ఇన్‌చార్జ్, అనంతపురం జిల్లా టాస్క్ పోర్స్ సభ్యులు బీసీ రమేష్ గౌడ్ సేవలకు గుర్తింపుగా ఇంటర్నేషనల్ ఎక్సలెన్సీ అవార్డు అందుకోవడం పట్ల జిల్లా, రాష్ట్రస్థాయి నాయకులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అభినందనలు తెలిపారు.