తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి! తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్‌లోనే ఉండాలి! అంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ఎక్స్( ట్విట్టర్)లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిన్న రాప్తాడులో నిర్వహించిన సిద్ధం ఎన్నికల శంఖారావ సభలో కూడా సీఎం వైయస్ జగన్ ఈ వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే.