యుద్ధనౌకను జాతికి అంకితమిచ్చిన సీఎం వైయస్‌ జగన్‌

తూర్పు నావికాదళ కేంద్రంలో ముఖ్యమంత్రి దంపతులు

విశాఖ: విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు తూర్పు నావికాదళ కేంద్రానికి చేరుకున్నారు. ఈ మేరకు తూర్పు నావికాదళం గౌరవ వందనాన్ని సీఎం వైయస్‌ జగన్‌ స్వీకరించారు. అనంతరం ఐఎన్‌ఎస్‌ విశాఖ యుద్ధ నౌకను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతికి అంకితం చేశారు. నేవల్‌ డాక్‌యార్డులో ఐఎన్‌ఎస్‌ యుద్ధ నౌకను సందర్శించారు. జలాంతర్గామి ‘ఐఎన్‌ఎస్‌ వేల’ను సందర్శించారు. 

సాయంత్రం ఆర్కే బీల్‌లో నేవీ ఆధ్వర్యంలో జరిగే మిలాన్‌–2022 ఇంటర్నేషనల్‌ పరేడ్‌ను సీఎం వైయస్‌ జగన్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభిస్తారు. గంటన్నరపాటు జరిగే సముద్రంలో యుద్ధ విన్యాసాలు, గగనతలంలో వాయుసేన విన్యాసాలను సీఎం వీక్షిస్తారు. ఇందులో నౌకదళ విభాగంలో కీలకమైన ఇండియన్‌ నేవీ సహా 39 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. భారతీయ నావికాదళం వివిధ ఆయుధాలతో నిర్వహించే మల్టీ డైమెన్షనల్‌ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 
 

తాజా వీడియోలు

Back to Top