అక్టోబర్‌ 1 నుంచి విశాఖలో ఇన్ఫోసిస్‌ కార్యకలాపాలు

 మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌
 

విజయవాడ: అక్టోబర్‌ 1 నుంచి విశాఖపట్నంలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. ఈ మేరకు మంత్రి ట్వీట్‌ చేశారు. ‘ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ అక్టోబర్‌​ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. తొలుత 1,000 మంది ఉద్యోగుల సామర్థ్యంతో మొదలు పెట్టి క్రమంగా 3 వేల మందికి ఉద్యోగాలు విస్తరించనున్నారు. మరో ప్రముఖ ఐటీ సంస్థ డల్లాస్‌ టెక్నాలజీస్‌ సెంటర్‌ కూడా తమ కార్యకలాపాలను విశాఖలో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంద‌ని మంత్రి ట్వీట్‌లో పేర్కొన్నారు.

Back to Top