చెస్ ఒలింపియాడ్  విజేతలకు సీఎం వైయ‌స్ జగన్ అభినందనలు

తాడేప‌ల్లి: 93 ఏళ్ల చెస్ ఒలింపియాడ్ చరిత్రలో భారత్ కు  తొలి స్వర్ణం ద‌క్కింది.  ఈ విజయంలో తెలుగుతేజం కోనేరు హంపి కీలకపాత్ర పోషించింది. ఈ సందర్భంగా ఏపీ సీఎం  వైయ‌స్ జగన్ విజేతలను అభినందించారు. ఈ విజయంలో ప్రముఖపాత్ర పోషించిన కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పెంటేల హరిలను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రశంసించారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆయ‌న ఆకాంక్షించారు.  

కరోనా నేపథ్యంలో పూర్తిగా ఆన్ లైన్ విధానంలో నిర్వహించిన చెస్ ఒలింపియాడ్ పోటీల్లో ఎవరూ ఊహించని ఫలితం వచ్చింది. నువ్వానేనా అంటూ భారత్, రష్యా జట్ల మధ్య జరిగిన అంతిమసమరంలో రెండు జట్లను విజేతలుగా ప్రకటించారు. 

తాజా వీడియోలు

Back to Top