గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యమే వైయస్‌ జగన్‌ లక్ష్యం

వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా 'స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

 గుంటూరు:  జాతిపిత మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యమే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లక్ష్యమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, శాసన మండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాసన మండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర ప్రజలకు 73వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవానికి  రెండు ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. ఒకటి.. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దుతో దేశానికి పూర్తి స్థాయి స్వతంత్రం లభించిగా..  రెండు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారన్నారు.

గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. పంచాయతీలకు పూర్తి స్థాయి అధికారాలు అందజేసి.. గ్రామ సచివాలయం నుంచే పరిపాలన అందించనున్నారని పేర్కొన్నారు. ప్రజలకు 29 అధికారాలు అందాల్సి ఉండగా గత ప్రభుత్వంలో 10 అధికారాలు కూడా అందలేదన్నారు. పూర్తి అధికారాలు అందించాలన్న ధ్యేయంతో వైయస్‌ జగన్‌  గ్రామ వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందజేయనున్నారని తెలిపారు. రెండున్నర నెలల పాలనలో సీఎం వైయస్‌ జగన్‌ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి,  వైయస్‌ఆర్‌ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి, అధికార ప్రతినిధి పద్మజారెడ్డి, చీఫ్‌ డిజిటల్‌ డైరెక్టర్‌ గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి, ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్‌  హర్షవర్ధన్‌, ఎల్లాసిరి గోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

లోటస్‌పాండ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 
73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లోటస్ పాండ్‌లో వైయస్‌ఆర్‌  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. గట్టు శ్రీకాంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజలకు 73వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది, బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యలు పరిష్కరించుకొని యావత్తు దేశం తమ వైపు చూసే విధంగా అభివృద్ధి చెందాలని కోరారు.

తాజా ఫోటోలు

Back to Top