వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఘ‌నంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

తాడేప‌ల్లి:  తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో  స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ వి.విజయసాయిరెడ్డి జాతీయపతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర‌ సముపార్జనకు ఎన్నో త్యాగాలు చేసిన మహనీయులు మహాత్మాగాంధీ, డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్, పింగళి వెంకయ్య, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజుల‌తోపాటు దివంగత మ‌హానేత శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీ వి.విజయసాయిరెడ్డి  కేక్ కట్ చేశారు. స్వాతంత్య్ర‌ వజ్రోత్సవాల వేళ.. పార్టీ కార్యకర్తలు ఆనందోత్సాహాలతో టపాసులు కాల్చారు.

ఈ సందర్భంగా శ్రీ వి.విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయి 76వ సంవత్సరంలో అడుగుపెట్టిన నేపథ్యంలో, ఈ వజ్రోత్సవాల సందర్బంగా  వేడుకలకు హాజరైన పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఎందరో స్వాతంత్య్ర‌ సమర యోధులు అనేక పోరాటాలు చేసి తీసుకువచ్చిన ఈ స్వాతంత్య్రాన్ని మనమందరం ఈరోజు అనుభవిస్తున్నాం. మనమంతా.. కొత్త ఉత్సాహంతో ప్రగతికి, వికాసానికి పునరంకితం కావాలని ప్రతి ఒక్కర్నీ కోరుతున్నాను. మహాత్మాగాంధీ గారు, భగత్ సింగ్ గారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు , చంద్రశేఖర్ ఆజాద్ గారు, మన రాష్ట్రం నుంచి అల్లూరి సీతారామరాజు గారు వంటి ఎందరో మహనీయులు పోరాటాలు చేసి సాధించి పెట్టిన స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. 

ఆ మహానుభావుల త్యాగ ఫలితమే..
ప్రజాస్వామ్యం,స్వేచ్ఛ‌, స్వాతంత్య్రాన్ని మనం అనుభవిస్తున్నామంటే అది ఆ మహానుభావుల త్యాగఫలం అని విజయసాయిరెడ్డిగారు అన్నారు.  దేశ అభివృద్ధికి మనమంతా కృషి చేయాలి. భారతదేశం వినూత్న దేశం.. యూనిక్ కంట్రీ.. స్వాతంత్య్రం వచ్చిన  తర్వాత మన దేశం రెండుముక్కలుగా పాకిస్తాన్, భారతదేశంగా విడిపోయింది. ఆ రోజుల్లో మత ప్రాతిపదికన విడిపోయింది. విభిన్న జాతులు, సంస్కృతులు ఉన్న ఈ దేశంలో యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే భిన్నత్వంలో ఏకత్వం అనే సిధ్దాంతం మనం తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం.

 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలంటే..  ఏ కులం అయినా, ఏ మతం అయినా, ఏ సంస్కృతి అయినా అందరికి కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని మూడు విధాలుగా నేను చెప్పదలుచుకున్నాను. 

మొట్టమొదటిది న్యాయం.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం దేశంలో ప్రతి ఒక్కరికి న్యాయం ఒకే విధంగా అందాలి. కులాలపైన, మతాల ఆధారంగా న్యాయం కాదు. అందరికి ఒకే విధంగా న్యాయం జరగాలి. 

రెండు ఇంటిగ్రిటీ.. దేశ సమగ్రత అనేది  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. గతంలో దేశం ఏ విధంగా మత ప్రాతిపదికగా విడిపోయిందో.. భవిష్యత్తులో ఏ విధమైన విభజన ఉండకూడదు. అందరూ కూడా సమైక్యంగా ఉండాలి. 

మూడు సమన్యాయం.. అది ఎవరైనా, ఏ కులానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా అందరూ కూడా సమానమే. సమాజంలో ఉండే వర్గాలు  రెండే ధనిక వర్గం..పేదవర్గం.. పేద, బడుగు, బలహీన వర్గాలు ధనికులతోపాటు సమాంతరంగా అభివృధ్ది చెంది, అందరికి ఒకే గౌరవం ఇవ్వాల్సిన పరిస్ధితి తీసుకురావాలనేది వైయస్సార్ సిపి, శ్రీ వైయస్ జగన్ గారి సిద్ధాంతం. వీటన్నింటికి కృషి చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను. 

భారతావనిలో ఆంధ్రావనిని అభివృద్ది పధంలోకి తీసుకురావాలనే దిశగా పార్టీనేతలు, పార్టీ కార్యకర్తలు రాజకీయాలను కూడా పక్కన పెట్టి సమిష్టిగా పనిచేయాలని విన్నవించుకుంటున్నాను. ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. విభిన్నజాతులు, విభిన్నసంస్కృతులన్నింటికి అతీతంగా జీవనవిధానాన్ని కొనసాగిస్తున్నాం. అన్నదమ్ముల్లా జీవిస్తున్నాం. అక్కడక్కడా కొన్ని ఘర్షణలు, కల్లోలాలు రావచ్చు. అయినా వాటన్నింటిని అధిగమించి ముందుకు వెళ్తున్నాం. 

పార్టీ మేనిఫెస్టో అనేది మనకు భ‌గ‌వ‌ద్గీత‌, బైబిల్, ఖురాన్.. ఏవైతే చెప్పామో.. కులాలు, మతాలకు అతీతంగా న్యాయం, సమగ్రత, సమానత్వం. ముఖ్యంగా సమానత్వం.... ఏ కులం అయినా.. ఏ మతం అయినా అర్హులందరికి శాచురేషన్ మోడ్ లో మనం పథ‌కాలు అందిస్తున్నాం. గతంలో స్వర్గీయ డాక్ట‌ర్  వైయస్ రాజశేఖరరెడ్డిగారు ఏ పథ‌కాలు అమలు చేశారో.. అవన్నీ భవిష్యత్తులోనూ భావి ప్రజానీకం మరిచిపోలేని విధంగా ప్రయోజనాలు చేకూరుస్తూ మన హృదయాలలో నిలిచిపోయాయి. అదే విధంగా ఆయన కుమారుడు శ్రీ వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా పేద, బలహీన వర్గాలకు ఆయన అమలు చేస్తున్న పథ‌కాలు అవి ఫ్రీ బేసిస్ కావు. సోషల్ ఇన్వెస్ట్ మెంట్ అన్నది గుర్తెరగాలి. ఆ సోషల్  ఇన్వెస్టిమెంట్ వల్ల మిగిలిన అన్ని సామాజిక వర్గాలు, అగ్రవర్ణాలతో కలసి సమాంతరంగా అభివృధ్ది చెందితే స్టేట్ జిడిపి పెరుగుతుంది. తలసరి ఆదాయం పెరుగుతుంది. వీటిని ఎటువంటి పరిస్ధితులలో ఉచితాలుగా పరిగణించకూడదు. కొంతమంది విమర్శలు చేయవచ్చు. ఉచితంగా ఫ్రీబేస్ ఇస్తున్నారు అని కానీ అది సరికాదు. శ్రీ వైయస్ జగన్ గారు ఒక ధ్యేయంతో బడుగుబలహీన వర్గాలను ఉన్నతవర్గాలతో సమానంగా చేయడానికి చేస్తున్న మహాయజ్ఞం. మనం ఏమీ రిఫ్రిజరేటర్లు ఇవ్వడం లేదు. మనం ఐరన్ బాక్సులు ఇవ్వడం లేదు. ఇచ్చేది ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, అమ్మఒడి.. ఇవన్నీ కూడా సోషల్ ఇన్వెస్ట్ మెంట్ కిందే భావించాల్సివస్తుంది. రాష్ట్ర‌ అభివృద్ది, ప్రగతికి అందర్ని కలుపుకుని వెళ్లాలి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్రాన్ని అభివృధ్ది పథంలోకి తీసుకువెళ్లే కార్యక్రమంలో.. మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం పాలకపక్షం మాత్రమే కాదు. ఇది ప్రజలకోసం, రాష్ట్ర‌ అభివృధ్ది కోసం అహర్నిశలు పనిచేసే పార్టీ. మనందరం పార్టీ కార్యకర్తలం. ఈ లక్ష్యాల సాధన కోసమే మనందరం కష్టపడి పనిచేద్దామని.. పనిచేస్తామని మీ అందరికీ తెలియచేస్తున్నాను.

శాసనమండలిలో చీఫ్ విప్ శ్రీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..  వైయస్ జగన్ గారు విశిష్టమైన పరిపాలన అందిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చాక కిందిస్దాయి వరకు పరిపాలన ఫలాలను తేవడంలో జగన్ గారు ముందున్నారు. ఆ ఫలాలు పేదలకు అందేలా చేయాలనే సంకల్పంతో శ్రీ వైయస్ జగన్ గారు అనేక పథ‌కాలు శాచురేషన్ మోడ్ లో అందిస్తున్నారు. శ్రీ వైయస్ జగన్ గారు గాంధీగారు కలలుగన్నవిధంగా పరిపాలన చేస్తూ.. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమంలో ముందుకు వెళ్తుంటే.. దేశం అంతా కూడా మ‌న‌వైపు చూస్తున్నారు. నేడు దేశంలో ఉన్న అనేక మంది నేతలు ఆంధ్రప్రదేశ్ ను చూసి నేర్చుకుంటున్నారు. ఇక్కడి విధానాలను స్టడీ చేస్తున్నారు.  నేడు జగన్ గారు చేపట్టిన పథ‌కాలు ఎవ్వరూ కూడా తొలగించలేరు. అవి ప్రజలు మెచ్చిన పథ‌కాలు అని అన్నారు. స్వాతంత్య్ర‌ ఫలాలు అందుకోవాల్సిన ప్రజలు దేశంలో ఇంకా ఉన్నారు. వారికి ఆ ఫలాలు అందించే దిశగా మనం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్య్ర సమరంలో త్యాగాలు చేసిన వారందరికి నివాళులు అర్పించాలన్నారు.

 రాజ్యసభ సభ్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. భార‌త‌దేశం సహజవనరులతో కూడిన దేశం. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి పేదవాడు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అయితే నేడు శ్రీ వైయస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వ్యవస్ధలను ప్రక్షాళన చేసి, నూతన పరిపాలనా విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ మూడేళ్లలో అనేక సంక్షేమ పథ‌కాలు ప్రవేశపెట్టి సంక్షేమ రథసారధిగా ముందుకు వెళ్తున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో ప్రజాప్రతినిధులు ప్రజల వద్దకు వెళ్తుంటే మాకు అన్నీ పథ‌కాలు అందుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. గతంలో పాలకలు కేవలం మాటలకు, నినాదాలకే పరిమితమయ్యారు. నేడు  శ్రీ వైయస్ జగన్ మార్పు తెచ్చారు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథ‌కాలను మంజూరు చేస్తున్నారు. పేదవారి ఆర్థికపరిస్థితిలో అనూహ్యరీతిలో మార్పు తెచ్చారు. దాంతో శ్రీ వైయస్ జగన్ పదికాలాలపాటు ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలందరూ ముక్తకంఠంతో నిన‌దిస్తున్నారు.

      శాసనమండలి సభ్యులు,కేంద్రకార్యాల‌య‌ పర్యవేక్షకులు శ్రీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ఆనాడు మహాత్మాగాంధీ కన్న కలలు గ్రామస్వరాజ్యం సాధించడం. నేడు శ్రీ వైయస్ జగన్, గాంధీ కన్నకలలను అధికార వికేంద్రీకరణ ద్వారా గ్రామ సచివాలయాలు స్థాపన చేసి సాకారం చేశారన్నారు. శ్రీ వైయస్ జగన్ ప్రజల అభిమానం పొందడం అనేది రోజురోజుకు ద్విగుణీకృతం అవుతుండటంతో ఏంచేయాలో పాలుపోని, దిక్కుతోచని పరిస్థితిలో చంద్రబాబు, ఎల్లో మీడియా.. రోజుకో కుట్రతో వారికున్న పచ్చమీడియాతో బురదచల్లుతున్నారన్నారు. వాటిని ప్రజలు నమ్మేస్థితిలో లేరని అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి వాటిని ఎదుర్కోవాలన్నారు.

        శాసనమండలి సభ్యులు శ్రీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. పేదవర్గాలు అభివృద్ది సాధించినప్పుడే నిజమైన ప్రగతి సాధించినట్లు అని భావిస్తున్న దూరదృష్టి కలిగిన నేత శ్రీ వైయస్ జగన్ అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు విద్యాపరంగా,ఆరోగ్య పరంగా పథ‌కాలు అందచేసినప్పుడే వారి వికాసం సాధ్యమవుతుందన్నారు. 

        శాసనమండలి సభ్యులు శ్రీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ.. సంక్షేమం ఉంటేనే అభివృధ్ధి ఉంటుంది. 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవ సమయాన ప్రతి పేదవాడు అభివృద్ధి పధంలోకి రావాలని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ తపన పడుతున్నారు. పేదవారు కూడా శ్రీ వైయస్ జగన్ చేస్తున్న సంక్షేమాన్ని, నాయకత్వాన్ని నమ్ముతున్నారు. దీనిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు పక్కదారి పట్టించే నీతిమాలిన వ్యవహారాలను తెరపైకి తెస్తూ, ప్రజలను గందరగోళ పరుస్తున్నాయి. మీడియా సంస్ధలు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి.  శ్రీ వైయస్ జగన్ గారి నాయకత్వం రాష్ట్రంలో మరింత బలపడిందని జాతీయస్దాయి పత్రికలు, ఇండియా టుడే చెప్పిన తర్వాత కూడా కొన్ని అనవసర అంశాలు ప్రాధాన్యంలోకి తీసుకువచ్చి జగన్ గారి ప్రాభవాన్ని తగ్గించేందుకు చేసే ప్రయత్నాలు ఫలించవని అన్నారు. ప్రతి కార్యకర్త  హిందూలో వచ్చిన విజయసాయిరెడ్డిగారి ఇంటర్వ్యూను చదవాలని సూచించారు.

    శాసనమండలి సభ్యులు శ్రీ మురుగుడు హనుమంతరావు,  శాసనమండలి సభ్యులు శ్రీ మొండితోక అరుణ్ కుమార్,  తాడికొండ శాసనసభ్యురాలు శ్రీ ఉండవల్లి శ్రీదేవి,  వైయస్సార్ సిపి మహిళా విభాగం అధ్యక్షురాలు, శాసనమండలి సభ్యురాలు శ్రీమతి పోతుల సునీత, శాసనమండలి సభ్యులు శ్రీ గంగుల ప్రభాకరరెడ్డి తదితరులు ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ.. వారి ఆలోచనలు, ఆదర్శాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ లో శ్రీ జగన్ గారి పాలన ఉందని చెప్పారు. 

ఈ  కార్యక్రమంలో రాష్ట్ర‌ సోష‌ల్ జ‌స్టిస్ స‌ల‌హాదారు శ్రీ జూపూడి ప్రభాకరరావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమన్వయకర్త శ్రీ పుత్తా ప్రతాప్‌రెడ్డి, వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ శ్రీ ఎంవిఎస్ నాగిరెడ్డి, పార్టీ ఈ ప్రగతి సిఐఓ శ్రీ హర్షవర్ధన్ రెడ్డి, గ్రంధాలయ సంస్ధ రాష్ట్ర‌ ఛైర్మన్ శ్రీ శేషగిరిరావు, కాపు కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ అడపా శేషు, ట్రేడ్ ప్రమోషన్  కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ రవిచంద్రారెడ్డి, నవరత్నాల ప్రోగ్రామ్ వైస్ ఛైర్మన్ శ్రీ నారాయణమూర్తి, శాఫ్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్దరెడ్డి, విద్యార్ధి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు కిరణ్ రాజ్, ఐటి విభాగం రాష్ట్ర‌ అధ్యక్షుడు పాశంరెడ్డి సునీల్ రెడ్డి, పలు కార్పొరేషన్ ఛైర్మన్లు, అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top