వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా ప్రోత్సాహకం పెంపు

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కీలక నిర్ణయం

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా కింద ప్రోత్సాహకం పెంచుతూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధారణ ప్రసవానికి ప్రోత్సాహకం రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచుతూ, సిజేరియన్‌ ప్రసవానికి రూ. వెయ్యి నుంచి 3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ఆస్పత్రి సేవలు అధ్వాన్నంగా ఉన్న జిల్లాలపై దృష్టిపెట్టాతలని అధికారులను ఆదేశించారు. రెండు వారాల్లో పరిస్థితి మెరుగుపడాలన్నారు. ఆరోగ్యశ్రీ నెట్‌ వర్క్‌ ఆస్పత్రుల్లో అన్ని నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ఆరు నెలల తరువాత మెరుగుపడకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాల్లో ఆరోగ్యశ్రీ కోఆర్డినేషన్‌ బాధ్యతలు జేసీలకు అప్పగించాలని ఆదేశించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top