యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన

ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చంద్రబాబు కుట్రలు

టీడీపీ తప్పుడు ప్రచారాలపై ఈసీకి ఫిర్యాదు 

చంద్రబాబు తప్పులు మీద తప్పులు చేస్తున్నారు.

శిశుపాలుడికి పట్టిన గతే చంద్రబాబుకు పడుతుంది

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి నాగిరెడ్డి

విజయవాడ: ఎన్నికల్లో చంద్రబాబు అధికార దుర్వినియోగం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి నాగిరెడ్డి మండిపడ్డారు. టీడీపీ తప్పుడు ప్రచారాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆయన విజయవాడలో వైయస్‌ఆర్‌సీపీ రాష్ట కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు యథేచ్ఛగా జీవోలు జారీ చేసి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓటర్లను ప్రలోభపట్టేందుకు కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. వ్యక్తిగత ట్విట్టర్‌లో పోస్టులను గవర్నమెంట్‌ ట్విట్టర్‌కు ట్యాగ్‌ చేస్తున్నారన్నారని తెలిపారు. ఎన్నికల్లో క్రిమినల్‌ కేసులున్న పోలీసు అధికారులను ఎలక్షన్‌ డ్యూటిలకు వేయకూడదని, కాని నిబంధనలకు విరుద్ధంగా ఏడుగురు పోలీసు అధికారులను నియమించడం పట్ల  ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామని తెలిపారు.

రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ పార్టీలోకి చేరకపోతే అంతం చేస్తామని ఓటర్లను బెదిరిస్తున్న  వీడియో దృశ్యాలను  ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.రైతులకు లబ్ధిచేకూర్చినట్లు టీడీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలకు పాల్పడుతుందన్నారు. అన్నదాత సుఖిభవ కార్యక్రమంలో 15వేల రూపాయలు రైతులకు ఇచ్చినట్లు..ఒక రైతుతో చెప్పించి తప్పుడు పబ్లిసిటి చేస్తున్నారన్నారు. అన్నదాత సుఖిభవ కార్యక్రమంలో తొమ్మిదివేల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేందని, మిగతా ఆరువేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేందని, ఆ సొమ్మును రాష్ట్రాలకు ఇవ్వడంలేదని, తొమ్మిది వేలలో కూడా రైతులకిచ్చింది కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే అని తెలిపారు. వెయ్యి రూపాయలు ఇచ్చి 15వేలు ఇచ్చామని టీడీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నారని దయ్యబట్టారు.

ప్రకటనలు ప్రచారం చేయడానికి ఎలక్షన్‌ కమిషన్‌ నుంచి అప్రూవల్‌ తీసుకోవాలన్నారు.కాని టీడీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా పబ్లిసిటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కోడ్‌ను ఉల్లంఘిస్తున్న టీడీపీపై ఎలక్షన్‌ కమిషన్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎలక్షన్‌ కమిషన్‌ వద్ద  అన్ని అనుమతులు తీసుకుని  ధర్మబద్ధంగా వైయస్‌ఆర్‌సీపీ  ముందుకెళ్తుందన్నారు. ముగ్గురు ఐపిఎస్‌ అధికారులకు అడిషనల్‌ డీజీపీలుగా ప్రమోషన్‌గా ఇచ్చారని, ఎన్నికల నిబంధనలు వచ్చిన తర్వాత ప్రమోషన్లు ఇవ్వడం విరుద్ధమన్నారు.వైయస్‌ జగన్,వైయస్‌ఆర్‌సీపీ నాయకులపై చంద్రబాబు  మాట్లాడరాని భాషలో దారుణంగా మాట్లాడుతున్నారని, ఈ వ్యాఖ్యలపై ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. 
–శిశుపాలుడికి పట్టిన గతే చంద్రబాబుకు పడుతుంది:గౌతంరెడ్డి
ఆర్థికపరమైన ప్రయోజనాలు చేకూరేలా జీవోలు విడుదల చేసి ప్రజలను ప్రలోభపెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత గౌతంరెడ్డి మండిపడ్డారు. శిశుపాలుడుకు ఎన్ని అవకాశాలు ఇచ్చారో..ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు అన్ని అవకాశాలు ఇచ్చారని, కాని  తప్పు మీద తప్పు చేస్తున్నారు. ఓటు ద్వారా రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెబుతారని తెలిపారు. శిశుపాలుడికి పట్టిన గతే చంద్రబాబుకు పడుతుందన్నారు. కోడ్‌ అమలులో ఉండగా పోలీసు అధికారులు ప్రమోషన్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. 

Back to Top