టిడ్కో గృహ స‌ముదాయంలో వైయ‌స్ఆర్ విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌

గుడివాడలో సీఎం వైయ‌స్ జగన్‌కు ఘన స్వాగతం  

విజ‌య‌వాడ‌: గుడివాడలో సీఎం వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. కొద్దిసేప‌టి క్రితం గుడివాడలోని మల్లాయపాలెం టిడ్కో లే అవుట్‌కు సీఎం జగన్‌ చేరుకున్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌పై టిడ్కో ల‌బ్ధిదారులు పూలవర్షం కురిపించారు. సీఎంకు మాజీ మంత్రి కొడాలి నాని, మంత్రి జోగి రమేష్, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యేలు పేర్ని నాని, కైలే అనిల్ కుమార్, సింహాద్రి రమేష్ బాబు, వల్లభనేని వంశీ తదితరులు ఘనస్వాగతం పలికారు. టిడ్కో గృహాలను సీఎం సందర్శించారు. అనంతరం టిడ్కో ఇళ్ల సముదాయంలో ఏర్పాటు చేసిన వైయ‌స్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాసేపట్లో బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. 

Back to Top