అక్రమ నిర్మాణ పనుల జీవోను రద్దు చేస్తాం: సీఎం వైయ‌స్  జ‌గ‌న్‌

సీఎం హామీతో ధర్నా విరమించిన ఎమ్మెల్యే మానుగుంట

ప్రకాశం: రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద అక్రమ నిర్మాణ పనులకు నిరసనగా  వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మానుగుంట మహిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయుకట్టు రైతుల శాంతియుత నిరసన తెలిపారు.గత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. దీనిపై సీఎం వైయస్‌ జగన్‌ స్పందించారు.మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ద్వారా సంఘటనకు సంబంధించి విషయాలపై సీఎం ఆరా తీశారు.వివరాలు తెలుసుకున్న అనంతరం  జీవోను రద్దు చేస్తామని ఎమ్మెల్యే మానుగుంట మహిధర్‌రెడ్డికి సీఎం వైయస్‌ జగన్‌ హామీ ఇవ్వడంతో  ఎమ్మెల్యే మానుగుంట ధర్నా విరమించారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top