ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేలా పనిచేయాలి

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన ఐఏఎస్ ప్రొబేష‌న‌ర్స్‌

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని 10 మంది ఐఏఎస్‌ ప్రొబేషనర్స్‌ (ఏపీ క్యాడర్‌ అసిస్టెంట్‌ కలెక్టర్స్‌ అండర్‌ ట్రైనింగ్‌ 2022 బ్యాచ్‌) తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేలా పనిచేస్తూ, సామాన్యుడికి సైతం అందుబాటులో ఉంటూ ముందుకుసాగాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వారికి మార్గనిర్దేశం చేసి ఆల్‌ ద వెరీ బెస్ట్ చెప్పారు. 10 మంది ఐఏఎస్ ప్రొబేష‌న‌ర్స్‌తో పాటు ఏపీ హెచ్‌ఆర్‌డీ డీజీ ఆర్‌.పి.సిసోడియా, ఏపీ హెచ్‌ఆర్‌డీ జేడీజీ పి.ఎస్‌.ప్రద్యుమ్న సీఎంను క‌లిసిన వారిలో ఉన్నారు.

ఐఏఎస్ ప్రొబేష‌న‌ర్స్ వీరే..
బి.స్మరణ్‌ రాజ్‌ (అనకాపల్లి జిల్లాకు అలాట్‌మెంట్‌), బి.సహదిత్‌ వెంకట్‌ త్రివినాగ్‌ (విజయనగరం), సి.యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి (తూర్పుగోదావరి), కల్పశ్రీ కే.ఆర్‌ (పల్నాడు), కుషల్‌ జైన్‌ (అనంతపురం), మంత్రి మౌర్య భరద్వాజ్‌ (వైఎస్సార్‌ జిల్లా), రాఘవేంద్ర మీనా (శ్రీకాకుళం), సౌర్య మన్‌ పటేల్‌ (ప్రకాశం), తిరుమణి శ్రీ పూజ (ఏలూరు), వి.సంజనా సింహా (ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు)

Back to Top