సీఎంను కలిసిన ఉన్నతాధికారులు

తాడేపల్లి: పశ్చిమగోదావరి జిల్లా నూతన కలెక్టర్‌గా నియమితులైన కార్తికేయ మిశ్రా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా సీఎం అదనపు కార్యదర్శిగా ఇటీవల నియమితులైన రేవు ముత్యాలరాజు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. వీరిద్ద‌రికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ `ఆల్ ద బెస్ట్` చెప్పారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top