నేను విన్నాను.. నేను ఉన్నాను

 • మీ కష్టాలన్నీ తీరుస్తా.. జీవితాల్లో వెలుగులు నింపుతా
 • ఐదేళ్లు సమయం ఇవ్వండి మీ కుటుంబాలను లక్షాధికారులను చేస్తా
 • పాదయాత్రలో ప్రజల కష్టాలను కళ్లారా చూశాను
 • చదువులకు, జబ్బులకు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి లేకుండా చేస్తా
 • వ్యవసాయాన్ని పండుగ చేస్తా, ఉద్యోగాల విప్లవం తీసుకొస్తా
 • వైయస్‌ఆర్‌ చేయూత పథకం ద్వారా ప్రతి అక్కను ఆదుకుంటాం
 • డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలన్నీ మాఫీ చేస్తా 
 • తాగు, సాగునీటి కటకట లేకుండా జలయజ్ఞానికి అధిక ప్రాధాన్యం
 • జిత్తులమారి నక్క చంద్రబాబు రూ. 3 వేలు ఇస్తే తీసుకొని మోసపోద్దు 
 • ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న కురుక్షేత్రంలో ప్రజలందరి తోడు, దీవెనలు కావాలి
 • ఎన్నికల తొలి సభలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

నర్సీపట్నం: పాదయాత్రలో ప్రజల కష్టాలు విన్నాను. 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ఆ కష్టాలు కళ్లారా చూశాను. ప్రతి అడుగులో ప్రతి కుటుంబం ఏమనుకుంటుందో విన్నాను. 13 జిల్లాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నాను. రాష్ట్రంలో ప్రజలు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సాయం కోసం ఎదురుచూస్తున్న ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి ఈ వేదిక మీద నుంచి మాటిస్తున్నాను.. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అని వైయస్‌ జగన్‌ ఎన్నికల తొలిసభలో మాటిచ్చారు. 
నర్సీపట్నం నుంచి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తొలి సభకు నర్సీపట్నం నియోజకవర్గ నలుమూలల నుంచి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. సభలో వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. పాదయాత్రలో నర్సీపట్నం వచ్చినప్పుడు జోరు వాన.. జోరు వానలో కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇప్పుడు మండుటెండ కొడుతున్నా.. వేలాదిగా తరలివచ్చిన ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మీ అత్మీయతలకు శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా..

గిట్టుబాటు ధరలు లేక, రుణమాఫీ లేక, ఐదేళ్లు కరువు వచ్చినా పట్టించుకోని ప్రభుత్వాన్ని చూశాను. ప్రజల కష్టాలను లెక్కచేయని ప్రభుత్వాన్ని చూశాం. ఎస్టీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ పేదల ఆవేదన విన్నాను. పూర్తి ఫీజురియంబర్స్‌మెంట్‌ అందక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాల కష్టాలు కళ్లారా చూశాను. 108 ఫోన్‌ కొడితే కుయ్‌.. కుయ్‌ అంటూ రావాల్సిన అంబులెన్స్‌లు రాకపోవడం చూశాను. ఆరోగ్యశ్రీ అమలు కాక వైద్యం కోసం ఆస్తులు అమ్ముకుంటున్న కుటుంబాలను చూశాను. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మంచాన పడితే.. పెరాలసిస్‌ వంటి రోగాలబారిన పడిన ప్రజలను పట్టించుకోని దీనస్థితిని చూశాను. 
మద్యానికి బానిపలై ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడంతో పాటు ఆ కుటుంబాలు పడుతున్న కష్టాలు చూశాను. మన రాష్ట్రంలో అక్షరాల 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయక, నోటిఫికేషన్‌ రాక ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న పిల్లలను కళ్లారా చూశాను. ఉద్యోగం లేకపోతే రూ. 2 వేల భృతి ఇస్తానన్న మాటలు విన్నాను. ఎగరగొట్టిన మోసాన్ని కళ్లారా చూశాను. ఉద్యోగాలు రాక పక్క రాష్ట్రాలకు తరలివెళ్తున్న మన పిల్లలను చూశాను. నీటి కోసం అలమటిస్తున్న గ్రామాలను చూశాను. పిల్లలను చదివించడం కోసం కూలీలకు పోతున్న అక్కచెల్లెమ్మల కష్టాలు విన్నాను. రాష్ట్రంలో ప్రతి నష్టాన్ని చూశాను. ప్రతి కష్టాన్ని విన్నాను. 

నర్సీపట్నంలో మీ అందరి మధ్య ఈ రోజు మా పార్టీకి ఓటేయండి, ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయండి అని అడిగే ముందు మాకు అధికారం ఇస్తే ఏం చేస్తామో చెబుతాను. మన ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో ఇవాళ రేషన్‌ కార్డు కావాలన్నా.. మరుగుదొడ్లు కావాలన్నా.. పెన్షన్‌ కావాలన్నా లంచాలు. మట్టి నుంచి ఇసుక వరకు దోచేస్తున్న ఈ పరిస్థితుల్లో.. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతికి తావులేని పాలన అందిస్తాను. కులపిచ్చిలేని పాలన ఇస్తాను. లా అండ్‌ ఆర్డన్‌ను ఈ రోజు ఎమ్మార్వోలు ఇసుక మాఫియాను ఆపితే ఆడపడుచు అని చూడకుండా ఎమ్మార్వోను జుట్టుపట్టుకొని ఈడ్చుకొని పోతున్న ఎమ్మెల్యేలను చూస్తున్నాం. మా చిన్నాన్నను పోగొట్టుకున్నా. సాక్షాత్తు ఇంట్లోకి దూరి అడ్డగోలుగా నరికిన లా అండ్‌ ఆర్డన్‌ సిచ్చివేషన్‌ కూడా చూస్తున్నాం. 

తల్లిదండ్రుల మీద చదువుల భారం లేకుండా చేస్తాను. ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలను రెండు సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేసి ఎలా మార్పు చేశామో, అంతకు ముందు ఎలా ఉందో ఫొటోలు కూడా చూపిస్తాం. ప్రతి కుటుంబం మీద వైద్యం పరంగా పడుతున్న భారాన్ని పూర్తిగా లేకుండా చేస్తానని హామీ ఇస్తున్నా. జబ్బులను నయం చేసేందుకు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి లేకుండా చేస్తా. వ్యవసాయాన్ని పండుగ చేస్తా. గిట్టుబాటు ధరలకు హామీ ఇస్తున్నా. పెట్టుబడులకు ఉచితంగా సాయం అందిస్తాం. ప్రతి రైతన్నకు భరోసా ఇస్తున్నా.. 

ఐదు సంవత్సరాల్లో ప్రతి నిరుపేదకు మరీ ముఖ్యంగా ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలకు చెబుతున్నా ఐదేళ్లు గడువు ఇవ్వండి మీ కుటుంబాలను లక్షాధికారులను చేస్తా. ప్రతి అక్కా చెల్లెమ్మను లక్షాధికారులను చేస్తా. చదువుకున్న ప్రతి నిరుద్యోగికి చెబుతున్నా.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ప్రతి సంవత్సరం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేస్తాం. గ్రామ సెక్రటేరియట్‌లు తీసుకొస్తాం. మీ గ్రామంలోనే చదువుకున్న పదిమంది పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా. మీ అందరికీ హామీ ఇస్తున్నా ఉద్యోగాల విప్లవం తీసుకువస్తాం. రేపు మన ప్రభుత్వం వచ్చిన తరువాత దేవుడి దయతో ప్రత్యేక హోదాను కూడా సాధించుకుందాం. ఉద్యోగాల అమలులో పిల్లలకు ఉద్యోగాలు వచ్చేందుకు ఒక అడుగు ముందుకు వేసి ఆ పిల్లల కోసం పరిశ్రమల్లో అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొస్తాం మొట్టమొదటి సభలో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం తీసుకొస్తా. మీ అందరికీ హామీ ఇస్తున్నా ఏ ప్రాంతాం, ఏ గ్రామం నీటి కటకటతో ఇబ్బంది పడకుండా ఐదేళ్లలో సాగు, తాగునీటిని తీసుకొస్తాం. ప్రతి ఎకరానికి నీరు అందించే విధంగా జలయజ్ఞానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. 

ప్రతి ఒక్క సంక్షేమం పథకం ప్రతి పేదవాడికి అందాలి. కులాలు, మతాలు, ప్రాంతాలు, రాజకీయాలు చూడం, చివరకు పార్టీలు కూడా చూడకుండా అందజేస్తాం. అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజే జన్మభూమి కమిటీలను రద్దు చేస్తాం. మీ భూములను, మీ ఇళ్లను, మీ ఆస్తులను ఏ ఒక్కరు ఆక్రమించుకోలేని విధంగా చట్టంలో మార్పులు చేస్తాం. 
వెబ్‌ల్యాండ్‌ పుణ్యమా అని చెప్పి రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌కు పోతే లంచాలు ఇవ్వండి పని జరగడం లేదు. మీ భూములు మీ పేరు మీద ఉన్నాయో లేదో తెలియని పరిస్థితి. ఈ వ్యవస్థలను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. అక్రమాలకు తావు లేకుండా చేస్తాం. ఇవన్నీ చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 

ఫ్యాన్‌ గుర్తుకు వేసే ఓటు మీ పిల్లల చదువులను, వారి ఉద్యోగాలను, మీ ఆరోగ్యం, మీకు వచ్చే ఆదాయం ఇలా ఏదీ తీసుకున్నా మీ జీవితంలో మీరు కనివీని ఎరుగని విధంగా మంచి మార్పు తీసుకువస్తా. ఏప్రిల్‌ 11వ తేదీన పోలింగ్‌. మనం పోరాటం చేస్తుంది చంద్రబాబు అనే జిత్తులమారి నక్కతో పోరాటం చేస్తున్నామని మర్చిపోవద్దు. అబద్ధాలు చెబుతారు. మోసం చేస్తారు. చివరకు వీళ్లంతా ఎన్నికలు వచ్చే సరికి గ్రామాలకు మూటల మూటల డబ్బులు పంపిస్తారు. అవినీతి డబ్బు వీరి దగ్గర చాలా ఉంది. మీ చేతిలో రూ.3వేలు పెట్టి ప్రలోభాలు పెట్టేందుకు కూడా ప్రయత్నం చేస్తారు రాబోయే రోజుల్లో 
మీ గ్రామంలో మీరు వెళ్లినప్పుడు మీ గ్రామంలోని ప్రతి అక్కకు చెప్పండి అక్కా అన్నా, చెల్లి చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దని చెప్పండి. దేవుడి ఆశీర్వదించి 20 రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది అన్న ముఖ్యమంత్రి అవుతాడు మన పిల్లలను కేవలం బడులకు పంపిస్తే చాలు రూ. 15 వేలు చేతిలో పెడతాడని చెప్పండి. మన పిల్లలు ఇంజినీర్లు చదవగలుగుతున్నారా.. డాక్టర్లు కాగలుగుతున్నారా.. చదువుల కోసం ఆస్తులు అమ్ముకోకుండా చదివించగలుగుతున్నామా.. 20 రోజులు ఓపిక పట్టమని చెప్పండి రూ. 3 వేలకు మోసపోవద్దని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత పిల్లల చదువుల కోసం ఎన్ని లక్షలు ఖర్చు అయినా అన్న చదివిస్తాడని ప్రతి అక్కకు, చెల్లికి చెప్పండి. 

చంద్రబాబు ఇచ్చే రూ. 3వేలకు మోసపోవద్దు తల్లి అన్న ముఖ్యమంత్రి అవుతాడు వైయస్‌ఆర్‌ చేయూత అన్న కార్యక్రమానికి శ్రీకారం చుడతాడు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయస్సులో ఉన్న ప్రతి అక్కకు అన్న తోడుగా ఉంటాడు. ప్రతి అక్క చేతిలో రూ. 75 వేలు పెడతాడు. అన్న తోడుగా ఉంటాడని ప్రతి అక్కకు చెప్పండి. పొదుపు సంఘాల్లో ఉన్నా ప్రతి అక్కా, చెల్లికి చెప్పండి చంద్రబాబుకు ఐదేళ్లు సమయం ఇచ్చాం అడ్డగోలుగా మోసం చేశాడు. చివరిలో రూ. 3 వేలు తీసుకొని మోసపోవద్దు. అన్న ముఖ్యమంత్రి అవుతాడు పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కాచెల్లికి ఎన్నికల నాటికి ఉన్న అప్పు అంతా నాలుగు దఫాల్లో నేరుగా మీ చేతుల్లోనే పెడతాడు అన్న అని చెప్పండి. మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే విప్లవాన్ని తీసుకువస్తాడు. బ్యాంకుల దగ్గరకు గర్వంగా వెళ్లే రోజు తీసుకొస్తాడని చెప్పండి. గ్రామాల్లో వెళ్లినప్పుడు ప్రతి రైతుకు చెప్పండి అన్నా చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు. అన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే అక్షరాల రూ. 50 వేలు రైతు భరోసా కింద ఇస్తాడని చెప్పండి. ప్రతి సంవత్సరం రూ. 12.500 మే మాసంలోనే ఇస్తాడని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అవుతాడు గిట్టుబాటు ధరలు కల్పిస్తాడని చెప్పండి. గ్రామంలో ఉన్న ప్రతి తాత దగ్గరకు వెళ్లండి అవ్వాతాత చంద్రబాబు పెన్షన్‌ ఇస్తున్నాడని చెప్పండి మూడు నెలల కిందట ఇదే పెద్ద మనిషి చంద్రబాబు ఎంతిచ్చాడని అడగండి.. అవ్వాతాతలను అడగండి అవ్వాతాత ఇదే పెద్దమనిషి చంద్రబాబు ఎన్నికలు కేవలం 3 నెలలు ఉన్నాయనగా అది కూడా అన్న చెప్పాడు కాబట్టి మోసం చేసేందుకు రూ. 2 వేలు ఇస్తున్నాడు. ఈ మోసానికి మోసపోవద్దు. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత అవ్వాతాతల పెన్షన్‌ రూ. 3 వేల వరకు పెంచుకుంటూ పోతాడని చెప్పండి.  నవరత్నాల్లోని ప్రతి అంశాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లండి ప్రతి ఒక్కరికి చెప్పండి అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన అందరి జీవితాలు బాగుపడతాయని చెప్పండి. ఎండమావులను నమ్మవద్దు. చంద్రబాబు మాటలు నమ్మొద్దు అని చెప్పండి. చంద్రబాబు ఐదేళ్ల మోసపూరిత పాలనలో మోసపోయాం. ఒక్కసారి జగనన్నకు కూడా అవకాశం ఇద్దామని గట్టిగా చెప్పండి. మీ అందరి ఆశీస్సులు, దీవెనలు కావాలి. 

ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి యుద్ధంగా జరుగుతున్నాయి. విశ్వసనీయతకు, వంచనకు మధ్య పోరు జరుగుతుంది. ఈ కురుక్షేత్రంలో మీ అందరి తోడు, దీవెనలు కావాలి. ఉమాశంకర్‌ గణేష్‌ మీ అందరికీ తెలిసిన వ్యక్తి మన పార్టీ తరుఫున మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గణేష్‌ నిలబడుతున్నాడు. మీ అందరి చల్లని దీవెనలు గణేష్‌కు ఇవ్వాలని కోరుతున్నాం. సత్యవతి పార్టీ తరుఫు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. మీ అందరి దీవెనలు ఇవ్వాలని వైయస్‌ఆర్‌ సీపీకి మీ తోడు దీవెనలు కావాలని, మన గుర్తు ఫ్యాన్‌ అని మర్చిపోవద్దు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top