ప్రతి కష్టాన్ని చూశా..ప్రతి బాధను విన్నా..

మోసగాళ్లను బంగాళాఖాతంలో కలపాలి..

ఎన్నికలొచ్చేసరికి చంద్రబాబు కపట ప్రేమ

ఒప్పిక పట్టండి మన ప్రభుత్వం వస్తోంది..

అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది..

అంబాజీపేట ఎన్నికల ప్రచార సభలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

తూర్పుగోదావరి:ఐదు సంవత్సరాల కాలంలో పట్టించుకోని చంద్రబాబు.. ఎన్నికలు వచ్చేసరికి కపట ప్రేమ చూపిస్తున్నాడని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. మోసగాళ్లను,అబద్ధాలను చెప్పేవాళ్లను బంగాళాఖాతంలో కలపాలని ధ్వజమెత్తారు. గన్నవరం నియోజకవర్గంలో అంబాజీపేట ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. మీ అందరి ఆశీస్సులతో,దేవుడి దయతో 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను.ఆ పాదయాత్రలో మీ కష్టాలను చూశా..మీ కష్టాలను విన్నా.రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఏమి అనుకుంటుందో దగ్గర నుంచి విన్నాను.సాయం కోసం ఎదురుచూస్తూ ఉన్న ప్రతి కుటుంబసభ్యుడికి ఈ వేదిక మీద నుంచి ఒక మాట ఇస్తున్నా, ప్రభుత్వం సాయం చేస్తుందని ఆశతో ఎదురుచూస్తూ . సాయం అందని అన్యాయం అయిన పరిస్థితుల్లో సమస్యల సుడిగుండంలో ఉన్నా  ప్రతి కుటుంబానికి ఈ వేదికపై మాట ఇస్తున్నాను.నేను విన్నాను..నేను ఉన్నాను.పాదయాత్రలో చూడని కష్టం లేదు. గిట్టుబాటు ధర లేక, చేస్తానన్న రుణమాఫీ చేయక రైతుల పడుతున్నా కష్టాన్ని చూశా..గోదావరిలో నీళ్లు కనిపిస్తాయి.కాని రెండో  పంటకు నీళ్లు ఉండని పరిస్థితి కళ్లతో చూశా. గిట్టుబాటు ధరలు ఉండవు, ధాన్యం చేతికొచ్చే సరికి కొనే నాధుడు కనిపించడు.వెయ్యి,పదకొండు వందల రూపాయలకు తెగనమ్ముకోవలసిన పరిస్థితి.నిరుపేదల కష్టాలను చూశా.వారు పడుతున్న బాధలను చూశా..పూర్తిగా రీయింబర్స్‌మెంట్‌ లేక ఆత్మహత్యలను చేసుకున్న పిల్లలను చూశా. తల్లిదండ్రులకు కష్టం రాకూడదని,వారు చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తున్నారని ఆవేదన తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న ఆ పిల్లలను చూశా..ఆ పిల్లల కుటుంబాలను చూశా.ఆ పాదయాత్రలో 108 నెంబర్‌కు ఫోన్‌ చేస్తే కుయ్‌ కుయ్‌ అంటూ 20 నిముషాల్లో వచ్చి పేదవారికి అండగా నిలవాల్సిన అంబులెన్స్‌ రాని పరిస్థితిని చూశా. ఆరోగ్యశ్రీ అమలు కాక వైద్యం కోసం అప్పులు కోసం ఆస్తులను అమ్ముకున్న పరిస్థితులను చూశా.దీర్ఘకాలిక రోగాలతో మంచాన పడ్డ కూర్చికే పరిమితమయిన వారిని పట్టించుకోని పరిస్థితులను చూశా..పాదయాత్రలో మద్యం అమ్మకాలను చూశా.ప్రతి గ్రామంలోనూ మూడు,నాలుగు షాపులు కనిపిస్తున్నాయి. చిల్లర దుకాణాల్లో మందు అమ్మకాలను చూశా. తాగుడు వల్లన కుటుంబాలు చిన్నాభిన్నమై అక్కాచెల్లెమ్మల కష్టాలను చూశా.మన రాష్ట్రంలో ఉద్యోగాలు రాని పరిస్థితులు చూశా.రాష్ట్రంలో 2 లక్షల 30వేల పైచిలుకు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి.అందుకో నోటిఫికేషన్‌ వస్తుంది..అందుకో ఉద్యోగాలు వస్తాయి అని ఆశగా ఎదురుచూస్తున్న పిల్లలను చూశా.. యువత పడుతున్న అవస్థలు చూశా..చదువుకుని ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు రాక వేరే రాష్ట్రాలను వలసపోతున్న పరిస్థితులు చూశా..దేశాలకే పోతున్న పరిస్థితులను చూశా..నీటికోసం అలమటిస్తున్న గ్రామాలను చూశా.పక్కనే గోదావరి కనిపిస్తోంది..కాని తాగడానికి నీళ్లు లేని గ్రామాలను చూశా.పిల్లలను చదివించడం కోసం అక్కాచెల్లెమ్మలు కూలీలుగా మారిన పిరిస్థితులు చూశా..ప్రతి కష్టాన్ని చూశా.ప్రతి నష్టాన్ని చూశా..స్పందించాల్సిన ప్రభుత్వం స్పందించని తీరును చూశా..నేను చూశా..నేను విన్నాను..నేను ఉన్నాను అని చెబుతున్నా..ఇదే జిల్లాలో చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు చూశారు.ఎన్నికల ముందు చంద్రబాబు ఎన్నికల ప్రణాళిక అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఆ మేనిఫెస్టోలో  ప్రతికులాన్ని పిహెచ్‌డి చేసి మరి మోసం చేశారన్నారు.ఇదే పెద్ద మనిషి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం కోసం చేసిన మోసాలు చూశాం.ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ మనిషికి చిత్తశుద్ధి లేదు అని చెప్పడానికి మీ జిల్లాకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఇచ్చిన హామీలు చదువుతా..కాకినాడ,రాజమండ్రిలను స్మార్ట్‌ సిటీలుగా చేస్తానన్నాడు జరిగాయా అని అడుగుతున్నా..చివరికి కాకినాడకు ఇచ్చిన స్మార్ట్‌ సిటీ నిధులను కూడా ఖర్చుపెట్టుకోలేని పరిస్థితి.పెట్రోలియం యూనివర్శిటీ, పెట్రోలియం కారిడార్‌ అన్నాడు..కాకినాడలో టర్మినల్‌ అన్నాడు.తునిలో నౌకా నిర్మాణ కేంద్రం అన్నాడు..కొత్తగా ఇంకో పోర్టు అన్నాడు.ఎలక్ట్రానిక్‌ హర్డ్‌వేర్‌ పార్కు అన్నాడు..ఎక్కడైనా కనిపించాయా అని అడుగుతున్నా..తెలుగు విశ్వవిద్యాలయం,కోనసీమకు కొబ్బరి పీచు ఆధారిత పరిశ్రమ అంట..ఎక్కడైనా కనిపించిందా అని అడుగుతున్నా..ఫుడ్‌ పార్కు,ఆక్వాకల్చర్‌ ప్రోసెసింగ్‌ యూనిట్‌  ఇలా కథలన్నీ వింటూ పోతే చాలా చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు.చంద్రబాబు చిత్తశుద్ధి ఏమిటో ఒక్కసారి అర్థం చేసుకోండి.  ఈ పెద్ద మనిషి మోసం చేశాడు కాబట్టి, అబద్ధాలు చెప్పాడు కాబట్టి, అన్యాయం చేశాడు కాబట్టి.. ఈ పెద్దమనిషి రేపు ఎన్నికల్లో చేయని కుట్ర అంటూ ఉండదు.ఇదే పెద్దమనిషి అవినీతి ద్వారా సంపాదించిన సొమ్మును ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేసే కార్యక్రమం చేస్తాడు.ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి మూటలు,మూటలు డబ్బులు పంపిస్తాడు.గ్రామాల్లోకి ఆ డబ్బు చేరుతుంది. ఆ డబ్బుతో ఈ పెద్దమనిషి చంద్రబాబు మూడువేల రూపాయలు చేతిలో పెట్టి మళ్లీ మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తాడు.మమ్మల్ని అందరి ఒకటే కోరుతున్నా.మీ గ్రామాల్లో ప్రతి అక్క,చెల్లెమ్మ,అవ్వ,తాత,అన్నకు చెప్పండి..చంద్రబాబు ఇచ్చే మూడువేల రూపాయలకు మోసపోవద్దని చెప్పండి.ఇరవై రోజులు ఒప్పిక పట్టండి..అన్న ముఖ్యమంత్రి అవుతాడు..మన అందరికి ప్రభుత్వం వస్తుందని చెప్పండి.అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను కేవలం బడులకు పంపిస్తే చాలు. అన్న సంవత్సరానికి 15 వేల రూపాయలు ఇస్తాడని చెప్పండి..గ్రామంలో ప్రతి అన్నకు చెప్పండి..ఈ రోజు మన పిల్లలను చదివించే పరిస్థితుల్లో ఉన్నామా అని అడగండి..మన పిల్లలు ఇంజనీరింగ్,డాక్టర్లు కావాలన్నా, పెద్ద చదువులు చదవాలన్నా,మన ఆస్తులను అమ్ముకుంటే తప్ప మన చదివించే పరిస్థితుల్లో లేమని చెప్పండి.ఈ పరిస్థితి మారాలంటే దేవుడు ఆశ్వీరందించి రేపు మన అందరి ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పండి..అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్‌గానో,డాక్టర్‌గానో, కలెక్టర్‌గానో ఏ చదువులయినా పర్వాలేదు..అన్న చదవిస్తాడు అక్కా అని చెప్పండి.ఉచితంగా అని చెప్పండి. ప్రతి ఇంట్లో చెప్పండి.45 సంవత్సరాలు నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ప్రతి అక్కాకు చెప్పండి.ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలుగా ఉంటూ, పేదరికంతో అలమటిస్తున్నా ప్రతి అక్కకు చెప్పండి..చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోవద్దు అక్కా..రేపు 20 రోజుల్లో మన అన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం అక్కా..అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 45 సంవత్సరాలు నిండిన ప్రతి అక్క చేతిలోనూ వైయస్‌ఆర్‌ భరోసా పథకం ద్వారా నాలుగు దఫాలుగా  75వేల రూపాయలు పెడతాడు అని చెప్పండి.పొదుపు సంఘాలలో ఉన్నాం. ఐదు సంవత్సరాలు చంద్రబాబు ఓటేసి చూశాం. రుణమాఫీ చేస్తాను అని చెప్పి మోసం చేసిన పరిస్థితి చూశాం.రుణాలు చూస్తే వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోయిన పరిస్థితి చూశాం..అని ప్రతి అక్కకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే మూడువేల రూపాయలకు మోసపోవద్దు అక్క.. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం..అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాలతో ఉన్న అక్కాచెల్లెమ్మలకు ఎన్నికల నాటికి ఎంత ఉంటే అంతా రుణం ఉంటుందో మొత్తం రుణమంతా నాలుగు దఫాలుగా నేరుగా మీ చేతుల్లో పెడతాడు అని చెప్పండి.మళ్లీ అన్న ముఖ్యమంత్రి కావాలి.మళ్లీ సున్నా వడ్డీకే రుణాలిచ్చే పరిస్థితి వస్తుందని చెప్పండి.

గతంలో దివంగత నేత, ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో చూశాం.మళ్లీ అదే రాజన్న రాజ్యం ఆయన కొడుకు జగనన్న రాజ్యంలో చూస్తామని చెప్పండి.మళ్లీ సున్నా వడ్డీ తెచ్చి లక్షాధికారులను చేస్తారు అని చెప్పండి.  ఐదు సంవత్సరాలు చంద్రబాబు పాలన చూశాం. రుణమాఫీ అన్నాడు..మోసం చేశాడు.అన్నిరకాలుగా రైతన్నల నడ్డివిడిచాడు.20 రోజులు ఓపిక పట్టండి.అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం..అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతన్న పెట్టుబడి కోసం ఎక్కడకు పోవాల్సిన పనిలేదన్నా..ప్రతి రైతన్నకు 12,500 చేతిలో పెడతారని చెప్పండి.అక్షరాల యాభై వేల రూపాయలు జగనన్న ప్రతి రైతన్న చేతులో పెడతాడు అనిచెప్పండి.గిట్టుబాటు ధరలు లేని పరిస్థితి చూశాం. అన్నకు ఒకసారి అవకాశం ఇద్దాం.. గిట్టుబాటు ధరలు కల్పించడమే కాదు.ధాన్యానికి బోనస్‌ కూడా ఇచ్చే రోజులు తెచ్చుకుందాం అని ప్రతి రైతుకు చెప్పండి.చంద్రబాబు ఇచ్చే మోసానికి మోసపొవద్దని ప్రతి  అవ్వకు,తాతకు చెప్పండి. అవ్వ,తాతా..మూడు నెలల కిందట పింఛన్‌ ఎంత వచ్చేది అని అడగండి.అవ్వ,తాత నోటిలోంచి వచ్చే మాట.చంద్రబాబు హయాంలో రావడం లేదు అని అంటారు. లేకపోతే ఇచ్చేది వెయ్యి రూపాయలు అని చెబుతారు. ఎన్నికల మూడు నెలలు ఉన్నాయన్నగా..చంద్రబాబు పెన్షన్‌ను పెంచినట్లు ఫోజులు కొడుతున్నాడు. ఆ పెన్షన్‌ ఎందుకు పెంచాడో నీకు తెలుసా..అని అడగండి. ఇదే పెన్షన్‌ జగనన్న చెప్పకపోయి ఉంటే పెరిగేందా అని అడగండి.ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పెన్షన్‌ పెంచాడు..అన్న చెప్పాడు కాబట్టి పెన్షన్‌ పెరిగింది అని చెప్పండి. చంద్రబాబు మాటలను నమ్మొదండి..ఐదు సంవత్సరాల కాలంలో పట్టించుకోని వ్యక్తి, ఎన్నికలు వచ్చేసరికి కపట ప్రేమ చూపిస్తున్నాడని అవ్వకు,తాతకు చెప్పండి.అన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం. పెన్షన్‌ను మూడువేల నుంచి పెంచుకుంటూ పోతాడన్నా అని చెప్పండి.చెడిపోయిన రాజకీయ వ్యవస్థ బాగుపడ్డాలన్నా,చెడిపోయినా రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత అనే పదానికి అర్థం రావాలన్నా..చెడిపోయినా రాజకీయ వ్యవస్థలో విలువలు అనే పదానికి అర్థం రావాలన్నా..రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలన్నారు.మోసం చేసేవాళ్లను,అబద్ధాలు చెప్పేవారిని బంగాళాఖాతంలో కలపాలి.మాజీ ఎంపీ రవీంద్రబాబుకు న్యాయం చేస్తానని తెలిపారు.జిల్లాలో నుంచి మొదటి ఎమ్మెలీగా నామినేట్‌ చేస్తానని తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top