ముఖ్య‌మంత్రితో హెచ్ఆర్‌సీ చైర్మ‌న్ భేటీ

మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ 2021-22 వార్షిక నివేదిక అంద‌జేత‌

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్ (హెచ్ఆర్‌సీ) చైర్మ‌న్ జ‌స్టిస్ మంధాత సీతారామ‌మూర్తి తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా హెచ్ఆర్‌సీ 2021 – 22 వార్షిక నివేదికను సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు అంద‌జేశారు. అనంత‌రం మాన‌వ‌హ‌క్కుల కమిషన్‌ సభ్యుడు డాక్టర్‌ జి. శ్రీనివాసరావు రచించిన కంబాటింగ్‌ కరప్షన్‌ ఇన్‌ ఇండియా – రోల్‌ ఆఫ్‌ యాంటీ కరప్షన్‌ ఏజెన్సీస్‌ పుస్తకాన్ని సీఎం వైయ‌స్‌ జగన్ ఆవిష్క‌రించారు. ముఖ్య‌మంత్రిని క‌లిసిన వారిలో హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ మంధాత సీతారామమూర్తితో పాటు జ్యుడిషియల్‌ సభ్యులు దండే సుబ్రహ్మణ్యం, నాన్‌ జ్యుడిషియల్‌ సభ్యులు డాక్టర్‌ శ్రీనివాసరావు గోచిపాత, హెచ్‌ఆర్‌సీ సీఈవో, సెక్రటరీ ఎస్‌ వి. రమణమూర్తి, కమిషన్‌ అధికారులు బొగ్గరం తారక నరసింహ కుమార్, కే.రవికుమార్ త‌దిత‌రులు ఉన్నారు. 

తాజా వీడియోలు

Back to Top