చిత్తూరులో గౌతమ్‌రెడ్డికి ఘన నివాళి 

 చిత్తూరు: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతి రాష్ట్రానికి, వైయ‌స్ఆర్‌సీపీకి తీరని చిత్తూరు శాసనసభ్యులు, చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు  అరణి శ్రీనివాసులు కొనియాడారు. గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. చిత్తూరులోని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో  మంగ‌ళ‌వారం మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాపసభ నిర్వహించారు. గౌతమ్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఆయన మృతికి సంతాప సూచకంగా రెండు నిమి షాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో చిత్తూరు నగర మేయర్ అమ్ముద, ఛుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి , టౌన్ బ్యాంక్ చైర్మన్ రామ్ గణేష్ ,  కార్పొరేటర్లు, కో ఆప్షన్ నెంబర్ లు, ఎంపిటిసిలు, సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top