అయ్యన్న తప్పు చేస్తే అరెస్ట్ చేయకూడదా..?

గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్

అయ్యన్న తప్పు చేశాడని చంద్రబాబే ఒప్పుకున్నాడు

ఫోర్జరీ డాక్యుమెంట్‌తో ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించుకుంటే తప్పు కాదా..?

తాడేప‌ల్లి:  టీడీపీ నేత అయ్య‌న్న పాత్రుడు తప్పు చేస్తే అరెస్ట్ చేయకూడదా..? అని మంత్రి  జోగి రమేష్ ప్ర‌శ్నించారు. ఫోర్జరీ డాక్యుమెంట్‌తో ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించుకుంటే తప్పు కాదా..? అని నిల‌దీశారు. అయ్యన్న తప్పు చేశాడని చంద్రబాబే ఒప్పుకున్నాడని తెలిపారు. అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేస్తే బీసీ నాయకుడిని అరెస్టు చేశారని టీడీపీ బీసీ నేతలు మాట్లాడుతున్నారు.. బీసీ నాయకులు తప్పు చేస్తే అరెస్ట్ చేయరా? నేనూ బీసీ నాయకుడినే .. నేను తప్పు చేస్తే అరెస్టు చేయరా? టీడీపీ నాయకులు రోడ్లమీదకు వచ్చి బీసీ నేతను అరెస్టు చేశారని కుల రాజకీయం మొదలుపెట్టారు. అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేయడానికి గల కారణం ఏమిటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ కు సంబంధించిన స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టడమే కాకుండా, ఆ స్థలానికి చెందిన డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేశారని అరెస్టు చేస్తే, దాన్ని రాజకీయం చేసి ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్న టీడీపీ నాయకులు చేస్తున్నార‌ని మంత్రి మండిప‌డ్డారు. చంద్రబాబు టీడీపీ నేతలకు సొంత రాజ్యాంగం రాశారు..? అని ధ్వ‌జ‌మెత్తారు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా టీడీపీ బతకద‌న్నారు. అధికారంలో లేకుంటే బీసీలు కావాలా చంద్రబాబూ..? అని నిల‌దీశారు. అధికారంలో ఉంటే చంద్రబాబుకు బీసీలు గుర్తుండరని విమ‌ర్శించారు. అయ్యన్నపై విచారణలో అన్ని తేలుతాయ‌ని చెప్పారు. చంద్ర‌బాబు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వ‌చ్చారు. టీడీపీని లాక్కుని ఎన్టీఆర్‌ను మాన‌సికంగా క్షోభ‌కు గురి చేశారు. దగ్గుబాటి కుటుంబాన్ని గెంటేసిన చరిత్ర చంద్రబాబుది. హరికృష్ణను స్వార్దానికి వాడుకున్న చరిత్ర చంద్రబాబుది.  అలాంటి చంద్రబాబు విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఎన్ని బుల్డోజర్‌లు పెట్టి లేపాలని చూసినా చచ్చిన టీడీపీ లేవద‌న్నారు. చిల్లర రాజకీయాలకు కేరాఫ్ చంద్రబాబు మారాడ‌ని విమ‌ర్శించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా..?. 175 సీట్లలో టీడీపీ ఒంటరిగా పోటీ చే స్తుందని చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా..? అని స‌వాలు విసిరారు. 175 స్థానాల్లో వైఎస్‌ఆర్ సీపీ విజయం సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.  ప్ర‌జా సంక్షేమ‌మే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ల‌క్ష్య‌మ‌ని చెప్పారు. చ‌ట్టం త‌న పని తాను చేసుకుపోతుంద‌ని మంత్రి జోగి ర‌మేష్ హెచ్చ‌రించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top