ఈనెల 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు ప్రారంభం

యాజమాన్యాలతో మంత్రులు అవంతి, వెల్లంపల్లి భేటీ 

తాడేపల్లి: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలతో మంత్రులు అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్‌ భేటీ అయ్యారు. కోవిడ్‌ నివారణ చర్యలు పాటిస్తూ 8వ తేదీ నుంచి హోటల్స్‌ తెరుచుకోవచ్చన్నారు. పుణ్యక్షేత్రాల్లో కూడా హోటళ్లు తెరిచేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రులు వివరించారు. టూరిస్టులు, యాత్రీకుల వసతి కోసం హోటళ్లు నిర్వహిస్తూనే కోవిడ్ నివారణ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాల‌న్నారు. హోటళ్లలో జాగ్రత్తలు పాటించాలని, కస్టమర్లు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేసుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. 

Back to Top