అంబేద్కర్‌ పేరును వ్యతిరేకించడం సరికాదు

హోం మంత్రి తానేటి వనిత
 

కోనసీమ:  కోనసీమ ప్రజల అభీష్టం మేరకే అంబేద్కర్‌ పేరు పెట్టామని హోం మంత్రి తానేటి వ నిత అన్నారు. అల్లర్ల వెనుక టీడీపీ, జనసేన పార్టీలున్నాయని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అంబేద్కర్‌ పేరును వ్యతిరేకించడం సరికాదని హోం మంత్రి హితవు పలికారు. కాగా, అమరాలపురంలో హైటెన్షన్‌ చోటు చేసుకుంది. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పేరును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టారు. పోలీసులపై నిరసనకారులు దూసుకువచ్చి రాళ్లతో దాడి చేశారు. రాళ్ల దాడిలో ఎస్పీ, డీఎస్పీతో పాటు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసు వాహనాలను నిరసనకారులు ధ్వంసం చేశారు. రెండుప్రైవేట్‌ కాలేజీ బస్సులను తగులబెట్టారు. కలెక్టరేట్‌ ముట్టడికి ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకోవడంతో ఆ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటలను హోం మంత్రి తానేటి వనిత తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలు సరైనవి కావని హెచ్చరించారు. 
 

Back to Top