వారానికి 4 రోజులు కచ్చితంగా ప్రజల్లోనే ఉండాలి

ప్రతీ గడపకూ వెళ్లాలి.. ప్రజలతో మమేకమవ్వాలని సీఎం ఆదేశించారు

గడప గడపకూ మన ప్రభుత్వం వర్క్‌షాప్‌ అనంతరం హోంమంత్రి తానేటి వనిత

తాడేపల్లి: గడప గడపకూ వెళ్లి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరఫున ప్రతినిధులుగా నిలబడాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారని హోంశాఖ మంత్రి తానేటి వనిత వివరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ అధ్యక్షతన గడప గడపకూ మన ప్రభుత్వం వర్క్‌షాప్‌ అనంతరం హోంమంత్రి వనిత మీడియాతో మాట్లాడారు. వారానికి 4 రోజులు, నెలలో కచ్చితంగా 16 రోజులు గడప గడపకూ మన ప్రభుత్వంలో పాల్గొనాలని సూచించారన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు వారు కాకుండా.. వారి కుమారులు, బంధువులను గడప గడపకూ కార్యక్రమానికి పంపిస్తున్నారని, అలా కాకుండా.. తప్పనిసరిగా నియోజకవర్గ ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందేనని దిశానిర్దేశం చేశారన్నారు. ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు వెళ్తేనే సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు వీలుంటుందని చెప్పారని, గ్రామ సచివాలయ పరిధిలో సమస్యలను గుర్తించి పంపిస్తే వెంటనే దానికి సంబంధించిన పనులు, నిధులు మంజూరు చేస్తామని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారన్నారు.  

 27 మంది ఎమ్మెల్యేలు కొంత వెనకబడి ఉన్నారని, ఆ నంబర్‌ వచ్చే రివ్యూలో మరింత తగ్గాలని, సీఎం గట్టిగా ఆదేశించారన్నారు. వారానికి 4 రోజులు కచ్చితంగా ప్రజల్లోనే ఉండాలని, గడప గడపకూ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ.. ప్రతీ గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మమేకం కావాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారని హోంమంత్రి తానేటి వనిత చెప్పారు. 
 

Back to Top