సీఎం వైయస్‌ జగన్‌ చెప్పిందే.. డబ్ల్యూహెచ్‌ఓ కూడా చెబుతోంది

వలస కూలీలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం

కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేసిన ఏకైక సీఎం వైయస్‌ జగన్‌

రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత

పశ్చిమ గోదావరి: కరోనా పరీక్షలు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. వైరస్‌ కట్టడి అయ్యే వరకు కరోనాతో కలిసి జీవించాల్సిందేనని సీఎం వైయస్‌ జగన్‌ చెబితే కొందరు అవహేళన చేశారని, కానీ, నేడు వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌ఓ) అదే చెబుతుందన్నారు. ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరితో కలిసి దెందులూరు జాతీయ రహదారిపై వలస కులీలకు ఉచితంగా పండ్లు, భోజన ప్యాకెట్లు అందజేశారు. 

ఈ సందర్భంగా హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. కరోనా కట్టడి నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజలకు అండగా నిలిచారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాలతో వలస కులీలను అన్ని విధాలా ఆదుకుంటున్నామని, ఇప్పటికే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వారిని తరలించామన్నారు. 

కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఏకైక  సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని హోంమంత్రి సుచరిత అన్నారు. వ్యవసాయ రంగాన్ని కూడా అన్ని విధాలుగా ఆదుకున్నారని, లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలు ఎవరూ ఇబ్బంది పడకుండా విడతల వారీగా రేషన్‌ పంపిణీ, ఇంటికి రూ.1000 ఆర్థిక సాయం అందించారన్నారు.
 

Back to Top