సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌కు అవార్డులే నిద‌ర్శ‌నం 

 హోం మంత్రి సుచరిత 

గుంటూరు: సీఎం వైయ‌స్ జగన్ పాలనలో పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా పని చేస్తుందని.. దీనికి నిదర్శనం పోలీసు వ్యవస్థకు వచ్చిన అవార్డులేనని హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత‌ చెప్పారు.   దేశంలోనే మొదటిసారి పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వండం ఏపీలోనే జరిగిందని తెలిపారు. మంగళవారం హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మహిళల భధ్రతపై అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకుని మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. శిథిలావస్థలో ఉన్నా పోలీసు భవనాలను నాడు-నేడు స్ఫూర్తితో పున:నిర్మించే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. మహిళ  పోలీసుల ఇబ్బందులను పరిష్కరించేందుకు దాతల సహకారంతో మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలన్నారు. పోలీసు స్టేషన్ల‌కు ఐఎస్ఓ మార్క్ అరుదుగా వస్తుందని చెప్పారు. నెల్లూరులోని ఒక పోలీసు స్టేషన్‌కు, ఐదు దిశ పోలీసు స్టేషన్ల‌కు ఐఎస్ఓ గుర్తింపు రావడం గర్వకారణమని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు.
 

తాజా ఫోటోలు

Back to Top