బాధిత కుటుంబాల‌ను అప్పుడెందుకు ప‌రామ‌ర్శించ‌లేదు లోకేష్‌?

హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత‌
 

గుంటూరు:  టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు మ‌హిళ‌ల‌పై దాడులు జ‌రిగితే మంత్రి హోదాలో ఉన్న లోకేష్ అప్పుడెందుకు ప‌రామ‌ర్శించ‌లేద‌ని హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత నిల‌దీశారు. టీడీపీ పాల‌న‌లో దాడికి గురైన త‌హ‌శీల్దార్ వ‌న‌జాక్షి, విద్యార్థినులు రిషితేశ్వ‌రి, సుగాలి ప్రీతి కుటుంబాల ఇళ్లుకు ఎందుకు వెళ్ల‌లేద‌ని ప్ర‌శ్నించారు. ప‌క్క రాష్ట్రంలో దిశ ఘ‌ట‌న జ‌రిగితే మ‌న రాష్ట్రంలో దిశ చ‌ట్టం తెచ్చిన ఘ‌న‌త సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిద‌ని గుర్తు చేశారు.మ‌హిళ‌ల‌ను రాజ‌కీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పైకి తీసుకువ‌స్తున్నార‌ని తెలిపారు.  దిశ యాప్‌ను ఇప్ప‌టి వ‌ర‌కు 40 ల‌క్ష‌ల మంది డౌన్ లోడ్ చేసుకున్నార‌ని చెప్పారు. ర‌మ్య ఘ‌ట‌న‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వెంట‌నే స్పందించార‌ని, బాధిత కుటుంబానికి రూ.14.5 ల‌క్ష‌ల ఆర్థిక సాయంతో పాటు ఇంటి ప‌ట్టా కూడా అందించార‌ని మంత్రి సుచ‌రిత‌ వివ‌రించారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top