జ‌న‌వ‌రిలో 6,500 పోలీసు ఉద్యోగాల భ‌ర్తీ

హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత‌
 

గుంటూరు: వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నెల‌లో 6,500 పోలీసు ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తున్నామ‌ని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేక‌తోటి సుచరిత పేర్కొన్నారు. వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర మూడేళ్లు పూర్తి అయిన సంద‌ర్భంగా ప్ర‌జ‌ల కోసం నాడు..ప్ర‌జ‌ల్లో నేడు అనే కార్య‌క్ర‌మం చివ‌రి రోజు సుచ‌రిత గుంటూరు జిల్లా కాకుమాను గ్రామంలో పాద‌యాత్ర నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా ఆమె మాట్లాడుతూ..పోలీసు శాఖ‌లో ఉద్యోగాల భ‌ర్తీకి జ‌న‌వ‌రి మాసంలో నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తామ‌న్నారు. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 6,500 ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌ని చెప్పారు. ఇక‌పై ప్ర‌తి ఏటా జ‌న‌వ‌రిలో పోలీసు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇస్తామ‌ని మంత్రి పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top