విజయవాడ: ప్రేమోన్మాది ఘాతుకానికి బలైపోయిన దివ్య తల్లిదండ్రులను రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. దివ్య చిత్రపటానికి నివాళులర్పించారు. తమకు న్యాయం చేయాలంటూ హోంమంత్రికి దివ్య తల్లిదండ్రులు లేఖ అందించారు. ఈ మేరకు హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. దివ్య ఘటన బాధాకరమన్నారు. ఘటనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నారు. దివ్య కుటుంబానికి అండగా ఉంటామని, మృతురాలి తల్లిదండ్రులు కోరుకున్నట్లుగానే సత్వరం న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ, 302 కేసు నమోదు చేశామని వివరించారు. అమ్మాయిలు ధైర్యంగా ఉండాలి ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, ముఖ్యంగా అమ్మాయిలు ధైర్యంగా ఉండాలని, ఎలాంటి సమస్య వచ్చినా తల్లిదండ్రుల దృష్టికి తీసుకురావాలన్నారు. 100కు డయల్ చేస్తే పోలీసులు వెంటనే స్పందిస్తారన్నారు. ప్రతి ఒక్కరూ దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.