ఉద్యోగులకు మేలు చేయడానికి ప్రభుత్వం సిద్దం

హెం మంత్రి మేక‌తోటి సుచ‌రిత‌
 

గుంటూరు: ఉద్యోగులకు మేలు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంద‌ని హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత అన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఆందోళనపై హోంమంత్రి స్పందించారు.  చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని... చర్చలకు అవకాశం ఇవ్వడం లేదనడం అబద్ధమని  అన్నారు. ఉద్యోగులు సహకరించాలని సీఎం కూడా చెప్పారన్నారు. చర్చలకు కమిటీ కూడా వేశామని తెలిపారు. ఉద్యోగులకు మేలు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. ఉద్యోగుల హౌస్ అరెస్టులు ఏమీలేవన్నారు. అనుమతి లేని సభలకు వెళ్ళవద్దని చెప్పామని తెలిపారు. కరోనాతో ఆర్థిక ఇబ్బందులున్నాయని హోంమంత్రి సుచరిత అన్నారు. 

తాజా వీడియోలు

Back to Top