అణగారిన వర్గాలకు వైయ‌స్ జ‌గ‌న్‌తోనే సామాజిక న్యాయం సాధ్యమైంది 

హోం మంత్రి  మేకతోటి సుచరిత  

 వైయ‌స్ జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు అగ్రతాంబూలం 

  పాలనలో నూతన ఒరవడి సృష్టించిన ఘనత వైయ‌స్ జగన్దే 

 రాజన్న రాజ్యం మళ్ళీ వచ్చింది.. అభివృద్ధి-సంక్షేమం రెండు కళ్ళుగా వైయ‌స్ జగన్ పాలన 

 వైయ‌స్ జగన్ ప్రభుత్వానికి అటు ప్రజలు.. ఇటు దేవుని సహకారం ఉంది 

 వైయ‌స్‌ జగన్ అద్భుత పాలనలో భాగస్వామ్యమైనందుకు నా జన్మ ధన్యమైంది 

  
  తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితోనే అణ‌గారిన వ‌ర్గాల‌కు సామాజిక న్యాయం సాధ్య‌మైంద‌ని హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత పేర్కొన్నారు.  సమాజంలో అణగారిన వర్గాలకు ఎప్పుడూ అందనటువంటి నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో ఈరోజు ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారు వాటా ఇచ్చారు.  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. ఎప్పుడూ అందని మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ పదవులు, ఆలయ కమిటీల్లోగానీ, ట్రస్టు బోర్డుల్లోగానీ అవకాశాలు కల్పించిన ఘనత ఒక్క జగన్ మోహన్ రెడ్డిగారికే దక్కుతుంది.  గతంలో ఎప్పుడూ రాజకీయపరంగా ఈ వర్గాలకు ఇటువంటి అవకాశాలు కల్పించిన పరిస్థితి లేదు.   ఇప్పుడు సామాజిక న్యాయం ప్రకారం, రాజకీయ పదవుల్లో సమాన అవకాశాలు పొందుతున్నామంటే.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనా విధానాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ గారి వల్లే సాధ్యమైంది. ముఖ్య‌మంత్రిగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేసి నేటికి రెండేళ్లు పూర్తి అయిన సంద‌ర్భంగా హోం మంత్రి మీడియాతో మాట్లాడారు.

  ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన రెండేళ్ళలోనే శ్రీ జగన్ ప్రతి వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెస్తూ.. పాలనలో నూతన ఒరవడి సృష్టించిన ఘనత జగన్ గారిదే.
 ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధనా విధానం తీసుకురావడమే కాకుండా, పిల్లల్ని బడికి పంపినందుకు విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి ద్వారా ఏటా రూ. 15 వేలు అమ్మల ఖాతాల్లో జమ చేస్తున్నారు. 
  పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో టాయిలెట్ లు కావాలన్నా, అదనపు తరగతిగదులు కావాలన్నా, మంచినీటి సదుపాయం కావాలన్నా ఏళ్ళ తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సన పరిస్థితి. ఈరోజు ఆ పరిస్థితులు లేవు. నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చిన ఘనత జగన్ గారిదే. 
  దీంతో ఆడపిల్లల డ్రాప్ అవుట్ శాతం తగ్గింది. పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేకంగా రోజుకో మెనూ తయారు చేసి  బలవర్థకమైన పౌష్టికాహారం  జగనన్న గోరుముద్దు ద్వారా అందిస్తున్నాం. 

  రాష్ట్రంలో మహిళలకు జగనన్న పెద్ద పీట వేశారు. మహిళలే మహరాణులు అని గుర్తిస్తూ, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్‌ కాపునేస్తం, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ సున్నా వడ్డీ, వైఎస్సార్‌ నేతన్న నేస్తం,  వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక, వైఎస్సార్‌ రైతు భరోసా, వైయస్సార్‌ మత్య్సకార భరోసా, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్‌ వాహనమిత్ర, వైఎస్సార్‌ లా నేస్తం, జగనన్న చేదోడు, వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా తదితర పథకాల ద్వారా ప్రత్యక్షంగా రూ. 56,875 కోట్లు నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేశారు. పరోక్షంగా రూ. జగనన్న గోరుముద్దు, వైయస్ఆర్ సంపూర్ణ పోషణ, వైయస్సార్‌ జగనన్న లేఅవుట్లు, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, జగనన్న విద్యాకానుక పథకాల ద్వారా రూ. 31,164 కోట్లు మహిళల ఖాతాల్లో జమ అయింది.  ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తం మహిళల ఖాతాల్లో రూ.88 వేల కోట్లకుపైగా చిలుకు లబ్ధి చేకూరింది. 

 రాష్ట్రంలో రాజన్న పాలన మళ్ళీ వచ్చిందని ప్రజలు ఆనందంగా ఉన్నారు.  నాడు డాక్టర్ వైయస్ఆర్ గారు సంక్షేమంపై ఏ విధంగా ప్రధానంగా దృష్టి పెట్టారో.. మళ్లీ అదే తరహాలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా జగన్ గారు పరిపాలన సాగిస్తున్నారు. 
 రైతు రాష్ట్రానికి వెన్నెముక.. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని సీఎం జగన్ గారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. రైతులకు సంబంధించి  విత్తనాలు, ఎరువుల నుంచి పండించిన పంటలకు గిట్టుబాటు ధరల వరకు.. ఆర్ బీకే కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్న ప్రభుత్వం ఇది. 

  ఈ ప్రభుత్వానికి అటు ప్రజలు, ఇటు దేవుడి సహకారం కూడా ఉంది. అందుకే జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి వచ్చాక.. డ్యామ్ లు పూర్తి స్థాయిలో నిండాయి, పంటలు బాగా పండాయి,  రైతు సంతోషంగా ఉన్నాడు. సంక్షేమ పథకాల అమలు ద్వారా పేద, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు 1లక్షా 31 వేల కోట్ల రూపాయల లబ్ధి జరిగింది. 

 కరోనా కష్టకాలంలో  గతంలో కోవిడ్ టెస్ట్ చేయించాలంటే పూణె పంపించాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు రోజుకు లక్షకు పైగా కోవిడ్ పరీక్షలు చేసే స్థాయికి ఎదిగాం. ఒకవైపు కోవిడ్ కేర్ సెంటర్లను సమర్థవంతంగా నిర్వహిస్తూనే.. మరోవైపు కోవిడ్ ను ఆరోగ్య శ్రీలో చేర్చి, పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. 
- పెద్ద ఆసుపత్రికి వెళ్ళాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సిన పరిస్థితి గతంలో ఉండేది. ఇప్పుడు వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ గారు మెడికల్ హబ్ లు తెస్తున్నారు.  ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ ఉండే విధంగా కొత్తగా 16 మెడికల్ కాలేజీలను తెస్తున్నారు. 

 రాష్ట్రం కోసం ఇంత చేస్తున్నా, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ గారు అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నా,  రెండేళ్ళ విధ్వంసం అని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. జగన్ గారి రెండేళ్ళ పాలనలో సంక్షేమం ఎలా జరిగిందంటే.. ఒక విస్పోటనంలా జరిగిందని ప్రజలు భావిస్తున్నారు. 
  అదే చంద్రబాబు 600కు పైగా హామీలు ఇచ్చి, వాటిల్లో ఒక్కటంటే ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను వంచించాడు. 
 అదే జగన్ మోహన్ రెడ్డిగారు మేనిఫెస్టోలో ఇచ్చిన 94.5 శాతం హామీలను కేవలం రెండేళ్ళలోనే అమలు చేసిన ఘతన జగన్ మోహన్ రెడ్డిగారిది. 

 తన సొంత కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం కుటుంబ పెద్ద ఎలా అయితే తాపత్రయపడతారో ఆవిధంగా ముఖ్యమంత్రి జగన్ గారు  రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే పెద్దఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. సంక్షేమం గురించి ఏనాడూ పట్టించుకోని చంద్రబాబు లాంటి వాళ్ళకు.. సంక్షేమం కోసం ఇన్ని వేల కోట్లు ముఖ్యమంత్రి జగన్ గారు ఖర్చు పెడితే కష్టంగానే ఉంటుంది. 

 గతంలో ఇంటి పట్టా ఇవ్వాలన్నా,  రేషన్ కార్డు, పింఛన్ కావాలన్నా, ఒక సర్టిఫికేట్ కావాలన్నా రోజుల తరబడి కాళ్ళ చెప్పులు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ఇంటి దగ్గరే సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. మరోవైపు గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా 4 లక్షల ఉద్యోగాలు కల్పించారు.  

 రెండేళ్ళ వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డిగారి సంక్షేమ, అభివృద్ధి పాలన ఎలా ఉందో.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆదిలక్ష్మి కుటుంబాన్ని ఓ చిన్న ఉదాహరణగా తీసుకుంటే.. ఆ కుటుంబానికి అందిన వివిధ సంక్షేమ పథకాలే నిదర్శనంగా కనిపిస్తాయి. వివిధ పథకాల ద్వారా  ఒక్క మహిళకే రూ. 11 లక్షల మేరకు లబ్ధి చేకూరింది. 
 పేద, బడుగు, బలహీన, మైనార్టీ, వర్గాలకు, మహిళలకు అండగా నిలబడిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు నిండు నూరెళ్ళు చల్లగా ఉండాలని, సువర్ణ పాలన అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు.  ఇటువంటి మంచి పాలనలో భాగస్వామ్యమైనందుకు మా జన్మ కూడా ధన్యమైందని మేక‌తోటి సుచ‌రిత పేర్కొన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top