వ‌ర‌ల‌క్ష్మి ఘ‌ట‌న చాలా బాధాక‌రం

బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన హోంమంత్రి సుచ‌రిత‌

ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ

సీఎం ప్ర‌క‌టించిన‌ ఆర్థిక సాయం రూ.10 లక్షల చెక్కు అందజేత

విశాఖ: గాజువాకలో ప్రేమోన్మాది ఘాతుకానికి బలైపోయిన వరలక్ష్మి కుటుంబ సభ్యులు రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. వరలక్ష్మి చిత్రపటానికి నివాళులర్పించి.. బాధిత తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, వరలక్ష్మి మృతికి బాధ్యులైనవారిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. వరలక్ష్మి మృతిపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని, బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం కూడా ప్రకటించారని చెప్పారు. యువతి మృతికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని చెప్పారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి హామీ ఇచ్చారు. సీఎం ప్రకటించిన రూ.10 లక్షల ఆర్థిక సాయం చెక్కును బాధిత తల్లిదండ్రులకు హోంమంత్రి అందజేశారు. హోంమంత్రి మేకతోటి సుచరిత వెంట దిశ ప్రత్యేక అధికారులు కృతికా శుక్లా, దీపికా పాటిల్‌ ఉన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top