నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు గ‌ర్వ‌ప‌డేలా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ పాల‌న‌

ప్ర‌తి మ‌హిళను ల‌క్షాధికారి చేయ‌డ‌మే మా ప్ర‌భుత్వ‌ ల‌క్ష్యం

వైయ‌స్ఆర్ చేయూత ప‌థ‌కంతో 23 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌లకు సాయం

మ‌హిళా సంక్షేమం గురించి మాట్లాడే అర్హ‌త చంద్ర‌బాబుకు లేదు

డ్వాక్రా రుణాల మాఫీ ఏమైంది చంద్ర‌బాబూ..?

రాష్ట్ర హోంశాఖ మంత్రి మేక‌తోటి సుచ‌రిత ధ్వ‌జం

తాడేప‌ల్లి: ప్ర‌తి మ‌హిళా ల‌క్షాధికారి కావాల‌ని దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పావ‌లా వ‌డ్డీకి రుణాలు ఇప్పిస్తే.. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ రెండు అడుగులు ముందుకు వేసి ప్ర‌తి మ‌హిళ‌ను ల‌క్షాధికారిని చేసి చూపిస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేక‌తోటి సుచ‌రిత అన్నారు. పాద‌యాత్ర సంద‌ర్భంగా ఇచ్చిన మాట ప్ర‌కారం అక్కాచెల్లెమ్మ‌ల కోసం వైయ‌స్ఆర్‌ చేయూత కార్య‌క్ర‌మాన్ని సీఎం ప్రారంభించార‌న్నారు. చేయూత ప‌థకం ద్వారా 23 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌లు ల‌బ్ధిపొందారని, అంతేకాకుండా ఈ ప‌థ‌కం ద్వారా ల‌బ్ధిపొందిన మ‌హిళ‌ల‌కు అమూల్‌, ఐటీసీ, రియ‌లన్స్ వారి ద్వారా వారివారి ఉత్ప‌త్తుల‌ను త‌క్కువ ధ‌ర‌కు మ‌హిళ‌ల‌కు అందించి ఆర్థికంగా స్థిర‌ప‌డేందుకు చేయూత‌ను అందించారన్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌లో మ‌హిళా లోకం అంతా సంతోషంగా ఉంద‌న్నారు.

తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మేక‌తోటి సుచ‌రిత విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరుపేద అక్క‌చెల్లెమ్మ‌ల‌కు వైయ‌స్ఆర్ చేయూత ప‌థ‌కం ద్వారా అందిస్తే..  ఇటువంటి గొప్ప కార్య‌క్ర‌మాన్ని తెలుగుదేశం పార్టీ నేత‌లు విమ‌ర్శిస్తున్నార‌ని మండిప‌డ్డారు. డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామ‌ని 2014 ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చిన చంద్ర‌బాబు.. ఆ హామీని అమ‌లు చేయ‌కుండా మోసం చేశాడ‌ని గుర్తుచేశారు. ఎన్నిక‌ల ముందు ప‌సుపు కుంకుమ పేరు చెప్పి రూ.10 వేలు మూడు విడ‌త‌లుగా ఇచ్చార‌ని ప్ర‌జ‌లు గ‌మ‌నించాల‌న్నారు.  

ఎన్నిక‌ల మేనిఫెస్టోను భ‌గ‌వ‌ద్గీత‌, ఖురాన్‌, బైబిల‌ భావించి ఇచ్చిన ప్ర‌తి హామీని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నెర‌వేస్తున్నారన్నారు.  సంవ‌త్స‌ర‌కాలంలోనే మేనిఫెస్టోలోని హామీల‌ను అమ‌లు చేసిన ఘ‌న‌త సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ద‌న్నారు. ప్ర‌మాణ‌స్వీకారం చేసే ముందే `ఆరు నెల‌ల కాలంలోనే ప్ర‌జ‌ల చేత మంచి ముఖ్య‌మంత్రి అనిపించుకుంటా`న‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చెప్పారని, ఈ రోజు దేశంలోని సీనియ‌ర్ ముఖ్య‌మంత్రుల‌తో పోటీప‌డి ఉత్త‌మ ముఖ్య‌మంత్రిగా మూడో స్థానం పొంద‌డం రాష్ట్రానికే గ‌ర్వ‌కార‌ణమ‌న్నారు. నాయ‌కులు ప్ర‌తి ఒక్క‌రూ గ‌ర్వ‌ప‌డేలా పాల‌న అందిస్తున్నార‌న్నారు.

సున్నావ‌డ్డీ రుణాలు ఇస్తామ‌ని చెప్పి.. క‌రోనా క‌ష్ట‌కాలంలో కూడా రూ.14 వంద‌ల కోట్లు మ‌హిళ‌ల ఖాతాల్లో జ‌మ చేశారని హోంమంత్రి సుచ‌రిత స్ప‌ష్టం చేశారు. విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను ఎవ‌రైనా సాకుగా చూపిస్తారని, కానీ, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌టించిన హామీలు ఎప్పుడెప్పుడు అమ‌లు చేస్తున్నామో తేదీల‌తో స‌హా ప్ర‌క‌టించి అమ‌లు చేస్తున్నారన్నారు. సెప్టెంబ‌ర్ 11న డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ఉన్న రుణాల‌ను 4 విడ‌త‌ల్లో మాఫీ చేస్తామ‌న్న హామీని నెర‌వేర్చ‌బోతున్నారని చెప్పారు. ప్ర‌తి కుటుంబంలోని మ‌హిళా వైయ‌స్ఆర్‌ ఆస‌రా, అమ్మ ఒడి, జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన‌, విద్యా దీవెన‌, చేయూత, పెన్ష‌న్ ప‌థ‌కాల ద్వారా సాయం అందుకుంటున్నార‌న్నారు. మ‌హిళ‌లు ఆర్థికంగా స్థిర‌ప‌డాల‌నేది సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ధ్యేయ‌మ‌న్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top