బాధితులకు మెరుగైన వైద్యం అందించండి

హోంమంత్రి సుచరిత 

గుంటూరు: విశాఖ ఘటనపై హోంమంత్రి మేకతోటి సుచరిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖపట్నం కలెక్టర్, మంత్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాద కారణాలపై డీజీపీ గౌతమ్ సవాంగ్, విపత్తు నివారణ శాఖ డీజీ అనురాధలతో మాట్లాడారు. సహాయకచర్యలను, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఘటనలో మృతిచెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఆసుపత్రులకు తరలించాలి: మంత్రి బొత్స సత్యనారాయణ  
విశాఖ ప్రమాదంపై సకాలంతో అధికారులు స్పందించి, బాధితులను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ నుంచి ప్రమాదకర రసాయన వాయువు లీక్ ఆగిపోయింది.. పరిస్థితి అదుపులో ఉందని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు.

 క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి: ఎమ్మెల్యే ఆర్కే రోజా
 
 విజయవాడ : వైజాగ్‌లో విషవాయువు లీకైన ఘటనపై ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు.  
 

Back to Top