పెన్షన్లు పెంపు వైయస్‌ జగన్‌ విజయమే..

విజయనగరం: వైయస్‌ జగన్‌ పాదయాత్ర ప్రజల్లో భరోసా నింపిందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు.జగన్‌ పాదయాత్ర స్పందనకు భయపడే చంద్రబాబు పెన్షన్లు పెంచారన్నారు.చంద్రబాబు పెన్షన్లు పెంచడం వైయస్‌ జగన్‌ విజయమే అని అన్నారు.ఏపీకి హోదా కోసం వైయస్‌ జగన్‌ మొదట్నుంచి పోరాడారన్నారు.హోదాపై చంద్రబాబు యూటర్న్‌ తీసుకుని జగన్‌ బాటలోకి వచ్చారన్నారు.చంద్రబాబుపై ఉన్న కేసులపై స్టే ఎత్తివేస్తే జైలుకు వెళ్ళాల్సి వస్తుందని కా్రంగెస్‌ పంచన చేరారని తెలిపారు.టీడీపీ నేతలు అడుగడుగునా అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటన కేసు ఎన్‌ఐఏకి అప్పగించినా పక్కదారి పట్టించాలని చంద్రబాబు యత్నిస్తున్నారని తెలిపారు.

Back to Top