జే.ఆర్ పురంలో ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’

వైయ‌స్ఆర్‌సీపీ జెండాను ఆవిష్కరించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ 

ఎచ్చెర్ల‌: రణస్థలం మండలం జే.ఆర్.పురం-1 గ్రామ సచివాలయం పరిధిలోని జే.ఆర్.పురం గ్రామం లో "‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’అనే కార్యక్రమాన్ని నిర్వ‌హించారు. ఈ సందర్భంగా గ్రామంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను   ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆవిష్క‌రించారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా గ్రామానికి చేసిన మంచిని గణాంకాలతో సహా వివరించేలా సంక్షేమ బోర్డును ఆవిష్కరించారు. అనంత‌రం ఎమ్మెల్యే మాట్లాడుతూ..నాలుగున్నరేళ్లుగా సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా రాష్ట్రాన్ని సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రగతిపథంలో న‌డిపార‌ని చెప్పారు. గ్రామంలో ప్ర‌భుత్వం చేసిన మంచిని గణాంకాలతో సహా కళ్లకు కట్టినట్లు వెల్లడించారు. ఎన్నికల మేనిఫెస్టోలో 99.5 శాతం హామీలను సీఎం వైయ‌స్‌ జగన్‌ అమలు చేసి మాట నిలబెట్టుకోగా 2014లో చంద్రబాబు వ్యవసాయ, డ్వాక్రా రుణాలను మాఫీ చేయకుండా నిలువుగా మోసగించిన తీరును వివరించారు.

 కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, రణస్థలం ఎంపీపీ ప్రతినిధి పిన్నింటి సాయికుమార్, ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతినిధి లంకలపల్లి ప్రసాద్, జడ్పీటీసీ టొంపల సీతారాం, మండల పార్టీ అధ్యక్షులు మహంతి పెద్దరామునాయుడు, జే.సి.యస్ ఇంచార్జ్ చిల్ల వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ ప్రతినిధి మైలపల్లి కామరాజు, మహిళా అధ్యక్షురాలు గురాన మానస,జే.ఆర్.పురం పంచాయతీ సర్పంచ్ బవిరిరమణ, ఎంపీటీసీ పచ్చిగుళ్ల సాయిరాం, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top