ఆరోగ్యాంధ్ర‌ప్ర‌దేశ్ దిశ‌గా అడుగులు

ముఖ్య‌మంత్రి వైయస్ జగన్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు ఆరోగ్యరక్ష

ఇదేదో కొత్త పథకం పేరు అనుకోకండి. తాజాగా వచ్చిన సామాజిక - ఆర్థిక సర్వే లో వెల్లడైన నిజం. 

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక-ఆర్థిక సర్వే 2019-20 ప్రకారం, శిశు మరణాల రేటు జాతీయ సగటు కంటే రాష్ట్రీయ సగటు తక్కువగా ఉంది. శిశుమరణాల జాతీయ సగటు 32 అయితే ఏపీలో 29 మాత్రమే ఉంది. 5ఏళ్ల లోపు శిశుమరణాల రేటు (యూ-5 ఎంఆర్) కూడా జాతీయ సగటు 37 ఉండగ రాష్ట్రీయ సగటు 35 ఉంది. 

గత ఏడాదిలో, కేంద్రీకృత పథకాల కింద ప్రారంభించిన చర్యలను కొనసాగిస్తూ, ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ,  వైయస్సార్ కంటివెలుగు ఇంకా ప్రస్తుత ఆరోగ్య పథకాలను మెరుగుపరచడం చూస్తే ''అందరికీ మంచి ఆరోగ్యం'' లక్ష్యాన్ని సాధించే దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని అర్థం అవుతుంది. 

ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల ఆర్థిక పరిమితితో 2,059 (1,000 కొత్తవి) వైద్య విధానాలకు ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి. 
ప్రభుత్వం గుర్తించిన బిపిఎల్ కుటుంబాలకు ఎండ్-టు-ఎండ్ నగదు రహిత ఆరోగ్య సేవలను అందించడం వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ ప్రధాన లక్ష్యం. 2019-20లో ఈ పథకం కింద 4,41,573 మంది రోగులు లబ్ధి పొందారు. వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ప్రయోజనం అందించేలా మూడు ప్రధాన నగరాలైన  హైదరాబాద్, బెంగళూరు. చెన్నైలలో మొత్తం 130 ఆస్పత్రులు ఎంపానెల్ చేసింది వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ 130 ఆసుపత్రులూ 2019 నవంబర్ 1 నుండి 2020 మార్చి 31 వరకూ ఆరోగ్య శ్రీ కింద 3,020 మంది రోగులకు 716 రకాల చికిత్సలు అందించాయి. 

ఆపరేషన్ తర్వాత రికవరీ కాలానికి వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్రచికిత్స జరిగిన రోగులకు రోజుకు రూ .225 చొప్పున గరిష్టంగా రూ .5 వేల వరకూ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. డిసెంబర్ 1, 2019 నుండి మార్చి 31, 2020 వరకు 1,05,702 మంది రోగులకు 72.93 కోట్ల రూపాయలు ఆపరేషన్ అనంతర భత్యం లభించింది. 

పాఠశాల పిల్లలకు కంటి సంరక్షణ కోసం వైయస్సార్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం మొదటి దశలో 95 శాతం మంది లబ్దిదారులకు కంటి పరీక్షలు చేసి అవసరమైన చికిత్స అందించారు. 

ఇవే కాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి అనేక చర్యలు చేపడుతోంది ఏపీ ప్రభుత్వం. కేన్సర్, డయాబెటిస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ అండ్ స్ట్రోక్ (ఎన్‌పిసిడిసిఎస్) నివారణ మరియు నియంత్రణ జాతీయ కార్యక్రమం కింద ఎన్‌.సి.డి క్లినిక్‌ లు, చిత్తూరు మినహా అన్ని జిల్లాల్లో కార్డియాక్ కేర్ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఇక తలసేమియా, డయాలసిస్ రోగులకు నెలకు రూ.10,000 ఆర్థిక సాయం అందిస్తోంది ఏపీ ప్రభుత్వం. 

ఎయిడ్స్ నివారణకోసం 1,936 కేంద్రాలను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. వీటి ద్వారా కౌన్సెలింగ్, పరీక్షలు, తల్లి నుండి పిల్లలకు వ్యాధి సంక్రమించకుండా నివారణలాంటి ప్రాధమిక సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 3లక్షల మంది హెచ్‌ఐవీ బాధితులున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. 145 కేంద్రాల ద్వారా రక్త నమూనాల పరీక్ష, రక్తమార్పిడి సేవలు అందిస్తున్నారు.

Back to Top