గోకుల క్షేత్రానికి భూ కేటాయింపు.. సీఎం వైయ‌స్ జగన్‌కు కృతజ్ఞతలు

విజయవాడ : సనాతన ధర్మాన్ని కాపాడేందుకు సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న సేవలు హర్షణీయమని హరేకృష్ణ మూవ్‌మెంట్‌ ఇండియా రాష్ట్ర ఏడీఎం సత్యగౌరచంద్రదాస్‌ చెప్పారు. విజయవాడలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. తమ సంస్థ తాడేపల్లి మండలం కొలనుకొండలో నిర్మిస్తున్న గోకుల క్షేత్రానికి భూమి కేటాయించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం గోకుల క్షేత్రం నిర్మాణం ప్రారంభిస్తున్నామని, ఈ కార్యక్రమంలో సీఎం వైయ‌స్‌ జగన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఇస్కాన్‌ బెంగళూరు ప్రెసిడెంట్‌ మధుపండిట్‌దాస్‌ ముఖ్య అతిథులుగా హాజరవుతారని చెప్పారు. 

Back to Top