దెనాలి ప‌ర్వ‌త్వంపై న‌వ‌ర‌త్నాల జెండా రెప‌రెప‌లు

విశాఖ‌:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అమ‌లు చేస్తున్న న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాలు ప్ర‌జ‌ల్లో సంతోషాన్ని నింపుతున్నాయి. న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాల జెండా ఇప్పుడు ఉత్త‌ర అమెరికాలోని అత్యంత ఎత్తైన దెనాలి ప‌ర్వ‌తంపై రెప‌రెప‌లాడుతోంది. విశాఖపట్నానికి చెందిన అన్మిష్ వర్మ ఉత్తర అమెరికాలో ఎత్తైన దెనాలి పర్వతాన్ని అధిరోహించారు. ఈ స‌మ‌యంలో న‌వ‌ర‌త్నాల జెండాను ఆయ‌న ప‌ర్వ‌తంపై ప్ర‌ద‌ర్శించి త‌న‌కున్న అభిమానాన్ని చాటుకున్నారు. అన్మిష్ వ‌ర్మ ప‌ర్వ‌తంపై న‌వ‌ర‌త్నాల జెండాను చూపుతున్న ఫొటోను వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. అన్మిష్ వర్మ ఉత్తర అమెరికాలో ఎత్తైన దెనాలి పర్వతాన్ని అధిరోహించినందుకు సంతోషంగా ఉంది. ఆయన యాత్రకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతు ఇచ్చింది.  ఏపీని గర్వించేలా చేస్తూ వైజాగ్ ప్రజలకు మరిన్ని ప్రశంసలు అందజేయాలని విజ‌య‌సాయిరెడ్డి ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top