హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా 

విజయవాడ:  ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఈరోజు విజయవాడలో హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ స్టాల్స్ ను ప్రారంభించారు. శేష సాయి కళ్యాణ మండపం నందు జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. తొలుత ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన అనంతరం రోజా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం చేనేత వస్త్రాలు ధరించిన మోడల్స్ తో కలిసి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  రోజాతో పాటు ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా వచ్చిన మొత్తాన్ని నిర్వాహకులు దాతృత్వం కోసం వినియోగించనున్నారు.
 

Back to Top