సీఎం వైయస్‌ జగన్‌కు బిగ్‌ థ్యాంక్స్‌

ముంబై: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్‌ జావెద్‌ హబీబ్‌ ప్రశంసల వర్షం కురిపించారు. నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఆర్థిక సాయం అందించేందుకు ‘జగనన్న చేదోడు’ పథకాన్ని ప్రారంభించడంపై జావెద్‌ హబీబ్‌ స్పందించారు. ‘కరోనా వైరస్‌ ప్రపంచం మొత్తాన్ని మార్చివేసింది. ఫ్రొఫెషన్లను కూడా మార్చింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఒక కొత్త పథకాన్ని తీసుకువచ్చారు. నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ‘జగనన్న చేదోడు’ పథకం అండగా నిలిచింది. రూ.10 వేల సాయంతో వారికి భరోసా పెరిగింది. దేశంలోనే ఇలాంటి పథకం తీసుకువచ్చిన మొదటి సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి బిగ్‌ థ్యాంక్స్‌ ' అంటూ ప్రముఖ హెయిర్‌ జావెద్‌ హబీబ్‌ ప్రశంసలు కురిపించారు. మరోవైపు లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ‘జగనన్న చేదోడు’ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని సెలబ్రిటీ స్టైలీస్ట్‌ హర్మన్‌ కౌర్‌ అన్నారు. 
 

Back to Top