తెలుగుదేశం పార్టీ వల్లనే పల్నాడులో అలజడి

 ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి 

గొడవలు ప్రేరేపిస్తున్నారు. దాడులు చేస్తున్నారు

దాన్ని రాష్ట్రానికి ఆపాదించాలని ప్రయత్నిస్తున్నారు

గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి వెల్లడి

టీడీపీ పాలనలో పల్నాడులో నక్సలిజమ్, ఫ్యాక్షనిజమ్‌

యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌. వేల కోట్ల విలువైన దోపిడి

ఏడుగురి దారుణ హత్య కేసులో బ్రహ్మారెడ్డి ఏ–1

ఇప్పుడు కూడా ఆయన వల్లనే పల్నాడులో గొడవలు

ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి స్పష్టీకరణ 

పల్నాడుకు ఒక్కటంటే ఒక్క మేలు చేయని చంద్రబాబు

ఈ ప్రభుత్వ హయాంలో రూ.4700 కోట్ల పనులు

పల్నాడు జిల్లాతో పాటు, మెడికల్‌ కాలేజ్‌ ఏర్పాటు

ఎక్కడా లేని విధంగా మూడు జాతీయ రహదారులు

పల్నాడులో అనేక అభివృద్ధి పనులు, కార్యక్రమాలు

అందుకే అన్ని వర్గాలూ వైయస్సార్‌సీపీ వెంటనే

దీంతో దిక్కు తోచక తెలుగుదేశం పార్టీ దాడులు

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి 

తాడేపల్లి:  తెలుగుదేశం పార్టీ వల్లనే పల్నాడులో అలజడి జ‌రిగింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి పేర్కొన్నారు. గడచిన 40 నెలల నుంచి పల్నాడును పులివెందులతో సమానంగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ అభివృద్ది చేస్తున్నారు. ఫలితంగా దిక్కు తోచని తెలుగుదేశం నాయకలు ఆ ప్రాంతంలో అకృత్యాలు అరాచకాలు సృష్టిస్తున్నారు. దీంతో ఇదేం ఖర్మరా బాబూ అని పల్నాడు వాసులు అనుకుంటున్నారు. చంద్రబాబు వైఖరిని తప్పు పడుతున్నారు.
    గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ దాదాపు రూ.4700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. అదే గతంలో చంద్రబాబు పాలన సమయంలో 1999–2004 మధ్య, తిరిగి 2014–2019 మధ్య పల్నాడును లూటీ చేశారు. ఆ ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించారు. అరాచకాలు సృష్టించారు. హత్యలు చేశారు. మళ్లీ ఇప్పుడు అవే మొదలు పెట్టారు. దీంతో పల్నాడు వాసులు దిగ్భ్రాంతి చెందుతున్నారు.     గతంలో చంద్రబాబు పాలన సమయంలో పల్నాడులో మావోయిస్టుల ప్రభావం చాలా ఎక్కువ. కరువు, కాటకాలు ఎక్కువ. పంటలకు నీరందే పరిస్థితి లేదు.

ఏడుగురి హత్యలో ఏ–1 బ్రహ్మారెడ్డి:
    ఫ్యాక్షనిజమ్‌. ఆనాడు ఇదే బ్రహ్మారెడ్డి తల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న తమ బంధువులు ఏడుగురు.. పోలీస్‌ స్టేషన్‌ బెయిల్‌ కోసం సంతకాలు పెట్టడానికి వెళ్తుంటే, పోలీస్‌ స్టేషన్‌కు చేరువలో దారుణంగా హత్య చేయించారు బ్రహ్మారెడ్డి. ఆ కేసులో ఆయన ఏ–1 నిందితుడు. అందుకే ఆయనను అరెస్టు చేశారు. ప్రజలు ఉద్యమించారు కాబట్టి, తట్టుకోలేక బ్రహ్మారెడ్డిని అరెస్టు చేశారు.
    ఆ తర్వాత ఆయనకే మళ్లీ 2009లో టీడీపీ టికెట్‌ ఇచ్చారు. అప్పుడు పిన్నెల్లి లక్ష్మారెడ్డి చేతిలో.. ఆ తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయాడు. దీంతో బ్రహ్మారెడ్డి మాచర్లలో కాకుండా, గుంటూరులో నివాసం ఉంటున్నాడు.

ఈ విషయం ఆలోచించండి:
    2004లో లక్ష్మారెడ్డి గెల్చిన తర్వాత, 2009లో రామకృష్ణారెడ్డి గెల్చిన తర్వాత.. మొన్నటి మాదిరిగా మాచర్లలో ఒక్క ఘటన కూడా జరగలేదు. ఒక్కసారి అందరూ ఆలోచించాలి. తెలుగుదేశం ఇంఛార్జ్‌గా చలమారెడ్డి, ఆ తర్వాం అంజిరెడ్డి ఉన్నా.. ఎప్పుడు గొడవలు జరగలేదు. ఘర్షణ చోటు చేసుకోలేదు. కానీ బ్రహ్మారెడ్డిని ఇంఛార్జ్‌గా నియమించిన తర్వాతే ఎందుకు గొడవలు జరుగుతున్నాయి? ఆలోచించండి.

వడేరాజులే లక్ష్యంగా దాడులు:
    ఇప్పుడు ముఖ్యంగా బీసీల మీద దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా వారిలోనూ వడేరాజులు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. కారణం 1983లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు వడేరాజులు ఆ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వారిలో దాదాపు 70 శాతం వైయస్సార్‌సీపీకి ఓటేశారు. దీంతో వారికి గడచిన 60, 70 ఏళ్లలో రాని పదవులు, ఈ 40 నెలల్లో వచ్చాయి.
    మాచర్ల మున్సిపల్‌ ఛైర్మన్, వడేరాజుల కార్పొరేషన్, గుంటూరు మార్కెట్‌ యార్డు చైర్మన్, మాచర్ల మున్సిపల్‌ ఛైర్మన్, పిడుగురాళ్ల మార్కెట్‌యార్డు ఛైర్మన్‌తో పాటు, ఇంకా వడేరాజులకు అనేక పదవులు లభించాయి. దీంతో వడేరాజులపై చంద్రబాబు కుళ్లు, కుతంత్రాలు చేస్తున్నారు. వారు రాజకీయంగా ఎదగకూడదని కుట్ర చేస్తున్నారు. మళ్లీ వారిని తమ వైపు లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు.

బాబు హయాంలో అదే పరిపాటి:
    చంద్రబాబు ఎప్పుడు సీఎంగా ఉన్నా పల్నాడులో లూటీలు, గొడవలు సహజంగా మారాయి. యరపతినేని శ్రీనివాసరావు నాయకత్వంలో గురజాలలో అక్రమ మైనింగ్‌. ఎక్కడైనా ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసులతో హింస లేదా వారిని హత్య చేయడం పరిపాటిగా సాగింది. మళ్లీ ఇప్పుడు అదే ప్రయత్నం కొనసాగుతోంది. బ్రహ్మారెడ్డి ఇంఛార్జ్‌గా వచ్చినప్పటి నుంచి మళ్లీ గొడవలు జరుగుతున్నాయి.

అప్పుడు జరగలేదు కదా?:
    పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గొడవలు చేయిస్తున్నారని అంటున్నారు. ఆయన తొలిసారి 2009లో ఎమ్మెల్యే అయ్యారు. అప్పుడు ఏ గొడవలు జరగలేదు. 2012లో ఉప ఎన్నిక జరిగితే, అప్పుడూ రామకృష్ణారెడ్డిగారు పోటీ చేసి గెల్చారు. 2014లో కూడా రామకృష్ణారెడ్డి గెల్చారు కదా? 2019 వరకు అధికారంలో ఉన్నది చంద్రబాబు కదా? 2019 ఎన్నికల్లో కూడా మళ్లీ రామకృష్ణారెడ్డిగారు గెల్చారు. అంటే గొడవలు లేకపోయినా, మా పార్టీ గెలుస్తుంది. ఇది వాస్తవం.

అందుకే కుట్రలు. కుతంత్రాలు:
    దీన్ని గుర్తించారు కాబట్టే, గుంటూరులో ఉన్న బ్రహ్మారెడ్డిని తీసుకొచ్చి, ఇక్కడ గొడవలు సృష్టిస్తున్నారు. ఎలాగైనా తిరిగి గెలవడం కోసం కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. 
    టీడీపీ నాయకులు ఏ సభ పెట్టినా, ర్యాలీ తలపెట్టినా ప్రజల నుంచి స్పందన రావడం లేదు. దీంతో వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేస్తున్నారు. మా పార్టీ బలంగా ఉన్న చోటకు వెళ్లి, నిందిస్తున్నారు. దాడులు చేస్తున్నారు. ఆ విధంగా కావాలనే గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారు.
    మా పార్టీ బలంగా ఉన్న చోట అలా వ్యవహరించి, ఇక్కడ ఏదో జరుగుతున్నట్లు రాష్ట్రమంతా చూపే ప్రయత్నం చేస్తున్నారు. మాచర్లను మరో చంబల్‌లోయగా అభివర్ణిస్తున్నారు. కానీ ఇవాళ ఇక్కడ అభివృద్ధి జరుగుతోంది. కేవలం చంద్రబాబు హయాంలోనే ఇక్కడ శాంతి భద్రతలు లేకుండా పోయాయి. ఫ్యాక్షన్‌ గొడవలు, హత్యలు కొనసాగాయి.

ఇప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు:
    సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ హయాంలో ఇక్కడ ఎంతో అభివృద్ధి జరుగుతోంది. పల్నాడుకు జిల్లా వచ్చింది. మెడికల్‌ కాలేజీ వచ్చింది. ప్రతి ఇంటికి కృష్ణా నీరు వస్తోంది. ఎక్కడా లేని విధంగా పల్నాడులో మూడు జాతీయ రహదారులు. మాచర్ల టు దాచేపల్లి. కొండమూడు టు పేరెచర్ల. నర్సారావుపేట టు వాడ్రేవు. 900 ఏళ్ల చరిత్ర కలగిన దాచేపల్లి, గురజాలను మున్సిపాలీటీగా మార్చారు.

కనీసం ఒక్కటైనా చేశారా?:
    14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పల్నాడులో కనీసం ఒక్క స్కూల్‌ కూడా పెట్టలేదు. కనీసం ఆస్పత్రి కూడా నిర్మించలేదు. ఎక్కడా నీరివ్వలేదు. పేదలకు ఇళ్లు కట్టివ్వలేదు. నిజంగా అవి చేసి ఉంటే, ఎక్కడైనా చూపమనండి.
    పల్నాడు వాసులకు ఈ నిజాలు తెలియాలి. ఎవరు అక్కడ ఫ్యాక్షనిజమ్‌ను ప్రోత్సహిస్తున్నారు. రెండు పేపర్లు, నాలుగు ఛానళ్లను అడ్డం పెట్టుకుని ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఎలాగైనా గెలవాలన్నది చంద్రబాబు కుట్ర.

 విధ్వంసం వారి అలవాటు:

    తెలుగుదేశం పార్టీకి విధ్వంసం సృష్టించడం అలవాటు. అదే ఇప్పుడు కనిపిస్తోంది. ప్రజల్లో ఎక్కడైనా అశాంతి ఉందా? తిరుగుబాటు ఎందుకు జరుగుతుంది? ఇక్కడ గతంలో ఏ ఎన్నికల్లో కూడా స్థానిక ఎన్నికల్లో దాదాపు 90 శాతం ఫలితాలు వైయస్సార్‌సీపీకి అనుకూలంగా వచ్చాయి. ఎందుకంటే ఆ స్థాయిలో ప్రజలకు సీఎంగారు మేలు చేస్తున్నారు. ఇక్కడ ఇంత అభివృద్ధి జరుగుతుంటే, విధ్వంసం చేయాల్సిన అవసరం ఏముంది?
    మళ్లీ అడుగుతున్నాను. పల్నాడులో తెలుగుదేశం చేసిన ఒక మంచి పని చూపమనండి. అదే మీరు వస్తే, మేము చేసినవి చూపుతాం. నాడు–నేడులో మారుతున్న స్కూళ్లు. కొత్త ఆస్పత్రుల నిర్మాణం. జాతీయ రహదారుల నిర్మాణం అన్నీ చూపుతాం.    

ఏకపక్షంగా దాడులు చేశారు:
    పోలీసులు తమ వంతుగా శాంతియుత వాతావరణం కోసం కృషి చేస్తున్నారు. ఎవరైనా ర్యాలీ లేదా కార్యక్రమం తలపెట్టినా, పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అనుమతి తీసుకోవాలి. కానీ మొన్న టీడీపీ నాయకులు ఆ పని చేయలేదు. హఠాత్తుగా 500 మంది కర్రలు, రాడ్లతో రోడ్లపై పడ్డారు. వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేశారు.
మోహన్‌రావు అనే బీసీ కడుపు మీద రాయితో కొట్టారు. కేవలం తెలుగుదేశం పార్టీ మీదనే దాడి జరిగితే, మోహన్‌రావుపై దాడి చేసింది ఎవరు?

మేము ఏనాడూ ప్రోత్సహించలేదు:
    చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇదే మాచర్లలో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 7 మర్డర్లు జరిగాయి. ఒకవేళ మా పార్టీ గొడవ చేయాలనుకుంటే, మేము సభ పెట్టుకున్నాం. కానీ ఎక్కడా గొడవలు జరగలేదు కదా? 

ఇవన్నీ వాస్తవాలు కాదా?:
    కానీ ఇటీవలే గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? సమాధానం చెప్పండి. వాళ్లు మా మీద వేలు చూపుతుంటే వారి వైపు నాలుగు వేళ్లు కనిపిస్తున్నాయి. ఆనాడు ఇక్కడ నక్సలిజమ్, ఫ్యాక్షనిజమ్‌ వాస్తవం కాదా? గురజాల ప్రాంతంలో వేల కోట్ల మైనింగ్‌.. వాస్తవం కాదా? అప్పుడు వారే జీఓలు ఇచ్చారు. వారే నిందితులను సస్పెండ్‌ చేశారు. మళ్లీ వారికే టికెట్‌ ఇచ్చారు.
    ఇక్కడ గొడవలు ప్రేరేపించడం, దాడులు చేయడం.. రాష్ట్రానికి ఆపాదించడం.. ఇక్కడ ఏదో జరిగిపోతోందని అభూత కల్పనలు సృష్టించడంలో తెలుగుదేశం పార్టీ వారు సిద్ధహస్తులు. వారిప్పుడు ఇక్కడ అదే పని చేస్తున్నారు.

Back to Top