గుంటూరులో నాలుగేళ్ల ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పండుగ‌

 గుంటూరు:  సీఎం వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి ప్రారంభించిన‌ ప్రజాసంకల్పయాత్ర నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా గుంటూరులో వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాలి గిరిధర్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, మేయర్ కావటి మనోహర్ నాయుడు గుంటూరు నగరపాలెంలోని వైయ‌స్సార్‌ విగ్రహానికి నివాళులర్పించి హిమని సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కార్పొరేటర్లు, వైయ‌స్ఆర్  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నెల్లూరు జిల్లాలో..
గూడూరులో జనహృదయనేత సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర నేటితో నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ వైయ‌స్సార్ విగ్రహం నుంచి సాదుపేట సెంటర్ వరకు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో  వైయ‌స్ఆర్  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కర్నూలు జిల్లాలో..
సీఎం వైయ‌స్ జగన్‌ పాదయాత్ర నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఆళ్ళగడ్డ నాలుగు రోడ్ల కూడలిలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి, ఎంపీపీ గజ్జల రాఘవేంద్ర రెడ్డి, చాగలమర్రి ఎంపీపీ వీరభద్రుడు, వైయ‌స్ఆర్  కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం జిల్లా..
టెక్కలిలో సీఎం వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్థానిక వైయ‌స్సార్ జంక్షన్ వద్ద వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, కేక్ కట్ చేసి పాదయాత్రను ప్రారంభించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top