మంత్రివర్గం నుంచి గుమ్మనూరు జయరాం బ‌ర్త‌ర‌ఫ్‌

తాడేపల్లి: పార్టీ ఫిరాయించిన మంత్రి గుమ్మనూరి జయరాంను రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ బర్తరఫ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సిఫార్సుకు ఆమోదం తెలిపారు. ఇదిలా ఉంటే.. తన మంత్రి పదవికి రాజీనామా చేయకుండానే  గుమ్మనూరు తాజాగా టీడీపీలో చేరడం గమనార్హం.  మరోవైపు మంత్రి గుమ్మనూరు జయరాం చేరికపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. గుంతకల్లు టీడీపీ కార్యాలయం ఎదుట ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. గుమ్మనూరు జయరాం అవినీతి పరుడంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  ముఖ్యంగా గుమ్మనూరు చేరికను మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జయరాం ఇచ్చే డబ్బు కు ఆశ పడి చంద్రబాబు ఆయన్ని టీడీపీలో చేర్చుకోవడం దౌర్భాగ్యమని, రాబోయే ఎన్నికల్లో గుమ్మనూరుకు సహకరించేది లేదంటూ గుంతకల్లు టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

Back to Top