చిత్తశుద్ధితో పని చేస్తున్న మాపై టీడీపీ దుష్ప్రచారం

పోలవరాన్ని సందర్శించిన ఎంపీలు, ఎమ్మెల్యేల బృందం

పశ్చిమ గోదావరి: చిత్తశుద్ధితో పని చేస్తున్న మాపై టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టును మంత్రులు ,ఎంపీలు, ఎమ్మెల్యేల బృందం సందర్శించింది. దిగువ కాఫర్‌ డ్యాం నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో బృందం పోలవరం ప్రాజెక్టు పర్యటనకు వెళ్లింది. ఎంపీలు కోటగిరి శ్రీధర్, మార్గాని భరత్,ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావ్, ధనలక్ష్మీలు పోలవరం పనుల పురోగతిని పరిశీలించారు. 

 కనీస అంశాలు పట్టించుకోలేదు:
– భగవంతుని సాక్షిగా చెప్తున్నా.. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సర్వనాశనం చేశాడు.
– దాన్ని ఇప్పుడు మేం బాగు చేస్తున్నాం. కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం చేయకుండా డయాఫ్రమ్‌ వాల్‌ కట్టారు.
– కాఫర్‌ డ్యామ్‌ను ప్రారంభించే ముందు అప్రోచ్‌ ఛానల్, స్పిల్‌ ఛానళ్లు పూర్తి చేసి, నది డైవర్షన్‌ వంటి కనీస ప్రొమాణిక అంశాలను వదిలేశాడు.
– దాంతో కాఫర్‌ డ్యామ్‌ను క్లోజ్‌ చేసే అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే అలా చేస్తే.. నదీ గర్భంలో ఉన్న గ్రామాలన్నీ మునిగిపోతాయి.
– అందుకు కారణం.. స్పిల్‌ వే, అప్రోచ్‌ ఛానళ్లు పూర్తి కాకపోవడమే.

బాబు బురద చల్లే కార్యక్రమం:
– చిత్తశుద్ధిగా పని చేస్తున్న ప్రభుత్వంపై చంద్రబాబు బురద జల్లుతూ రాజకీయం చేస్తున్నాడు.
– ఇప్పుడు రెండు కాఫర్‌ డ్యామ్‌లను పూర్తి చేసి మూసేశాం. అందువల్ల వరద వస్తే స్పిల్‌ ఛానల్, స్పిల్‌ వే మీదుగా ఆ వరద వెళ్లే అవకాశం ఉంటుంది.
– కాబట్టి వర్షం పడుతున్నా, వరదలు వచ్చినా కూడా మనం ఇక్కడ పనులు కొనసాగించవచ్చు. 
– నిజానికి ఇది గత ఏడాదే ఇది పూర్తి కావాల్సింది. కానీ అప్పుడు అనుకున్న సమయానికి ముందే భారీ వరదలు వచ్చాయి.
– దీంతో ఈ సీజన్‌ కోసం వెయిట్‌ చేయాల్సి వచ్చింది. ఆ వెంటనే యుద్ధ ప్రాతిపదికన లోయర్, అప్పర్‌ రెండు కాఫర్‌ డ్యామ్‌లు పూర్తి చేశాం. ఇంకా స్పిల్‌వే కూడా పూర్తి చేశాం.
– చిత్తశుద్ధితో పని చేసే ప్రభుత్వం మాది. అయినా చంద్రబాబు అదే పనిగా బురద చల్లుతున్నాడు.
– ఆనాడు ప్రతి సోమవారం పోలవరం అంటూ తిరిగిన చంద్రబాబు, ప్రాజెక్టు కోసం చేసిందేమీ లేదు. షోవర్క్, భజనలు.. ఇంకా బిల్లులు కాజేసే ప్రయత్నం తప్ప చేసిన పని శూన్యం.

పునరావాసంపై ప్రత్యేక దృష్టి పెట్టాం:
– పునరావాస పనులకు ఆనాడు చంద్రబాబు కేవలం రూ.193 కోట్లు మాత్రమే ఖర్చు చేశాడు.
– దాంట్లో కమీషన్లు రావు కాబట్టి పునరావాసానికి చంద్రబాబు ఎక్కువగా ఖర్చు పెట్టలేదు. ఆర్‌ అండ్‌ ఆర్‌ నిధులు నేరుగా లబ్ధిదారులకు వెళ్తాయి కాబట్టి బాబుకి ఏమీ రావు.
– మేం అధికారంలోకి వచ్చిన తర్వాత పునరావాస పనులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. పునరావాస పనుల కోసం రూ.1724 కోట్లు ఖర్చు చేశాం.
– ఆ పనుల కోసం అదనంగా రూ.542 కోట్లు మరో వారం పది రోజుల్లో రాబోతున్నాయి.
– వాస్తవాలన్నీ ఇలా ఉంటే.. చంద్రబాబు మా ప్రభుత్వంపై అన్యాయమైన ఆరోపణలు చేస్తూ మాపై నిందలు మోపుతున్నాడు.

వారి కమిషన్ల కక్కుర్తి. ప్రాజెక్టు నాశనం:
– నాకన్నా ముందున్న మంత్రి ఇంజనీరు. ఆయనకు అన్నీ తెలుసు.
– అన్నీ తెలిసే కమిషన్ల కోసం వారు పోలవరాన్ని సర్వనాశనం చేశారు.
– రెండు కాఫర్‌ డ్యామ్‌లు పూర్తి చేయకుండా వదిలేయడం వల్ల డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోయింది.
– డయాఫ్రమ్‌ వాల్‌ విలువ అప్పట్లోనే రూ.400 కోట్లు.
– రెండు కాఫర్‌ డ్యామ్‌ల మధ్యలో పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి. 22 మీటర్ల లోతున అగాధాలు ఏర్పడ్డాయి. ఇసుకంతా కొట్టుకుపోయింది.
– అప్పర్‌ కాఫర్‌ డ్యామ్‌ సక్రమంగా నిర్మించని కారణంగా నాజల్‌ ఎఫెక్ట్‌తో అది కొట్టుకు పోయింది.
– దీనంతటికీ కారణం ఎవరు..? ఇప్పుడు అవన్నీ పూర్తి చేయాలంటే రూ.3 వేల కోట్ల ఖర్చు అవుతుందని అంచనా

72 శాతం పనులు. పచ్చి అబద్ధం:
– అంత దుర్మార్గంగా పని చేశారు కాబట్టే, పోలవరం వెనుకబడి పోయింది.
– చంద్రబాబూ మీకు దమ్ముంటే సమాధానం చెప్పండి. మీరు 72 శాతం పూర్తి చేశారా?
– హెడ్‌ వర్క్స్‌ కి ఆనాడు వేసిన అంచనా రూ.5963.91 కోట్లు కాగా, ఖర్చు చేసింది రూ.3591 కోట్లు మాత్రమే
– దీన్ని లెక్కేసి 72 శాతం పనులు చేశామని చంద్రబాబు చెబుతున్నాడు.
– కానీ ఆ లెక్క కూడా తప్పే. ఖర్చు చేసిన నిధుల ప్రకారం చూసినా, పనుల్లో అది 60 శాతం మాత్రమే ఉంటుంది.
– నిజానికి ఆ పనుల్లో కూడా ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలు ఉన్నాయి. వాటిని అప్పటి సీఎం వైయస్‌ఆర్‌ గారు పూర్తి చేశారు.
– కాల్వలకు అవసరమైన భూసేకరణతో పాటు, 80 శాతం పనులు ఆయనే పూర్తి చేశారు. మరి ఆ లెక్క ఎక్కడికి పోయింది.
– అందుకే ఎలా చూసినా, చంద్రబాబు తన 5 ఏళ్ల హయాంలో పోలవరం ప్రాజెక్టులో చేసిన పనులు కనీసం 10 శాతం అయినా ఉంటాయా?

తప్పులు చేసి నిందలు:
– పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇన్ని తప్పులు చేసిన చంద్రబాబు, అప్పట్లోనే ప్రాజెక్టు వ్యయ అంచనాలు రూ.7422 కోట్లకు పెంచారు.
– అయినా పనులు మాత్రం సాగలేదు. కానీ చంద్రబాబు మాత్రం నోరు తెరిస్తే అబద్దాలు చెప్తూ 72 శాతం పూర్తి చేశాను అంటున్నాడు.
– అన్ని తప్పులు చేసిన వారు, ఇప్పుడు సీఎంగారిని నిందిస్తున్నారు. తమకు అనుకూల మీడియా ఉంది కాబట్టి, పదే పదే దుష్ప్రచారం చేస్తున్నారు.
 
బాధ్యుడు చంద్రబాబు కాదా?:
– డయాఫ్రమ్‌ వాల్‌ని ఏమి చేయాలో తెలిస్తేనే కానీ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం.
– నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) బృందం డయాఫ్రం వాల్‌ను పరిశీలించింది.
– ఏం చేయాలన్న దానిపై వారు మరో రెండు వారాల్లో నివేదిక ఇస్తారు.
– ఎన్‌హెచ్‌పీసీ నివేదిక వచ్చాకే ప్రణాళిక బద్ధంగా దాన్ని ఎప్పుడు పూర్తి చేస్తామనేది తేలుతుంది.
– ఆనాడు డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణ అంచనా వ్యయం రూ.400 కోట్లు. ఒక వేళ కొత్తగా ఆ వాల్‌ను ఇప్పుడు కొత్తగా కట్టాల్సి వస్తే, ఎంత ఖర్చు చేయాల్సి వస్తుందో తెలియదు.
– మరి దీనికి బాధ్యుడు చంద్రబాబునాయుడు కాదా?.. అని మంత్రి శ్రీ అంబటి రాంబాబు ప్రశ్నించారు.

Back to Top