'గడప గడపన' ఘన స్వాగతం

అనంతపురంఐ ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. మంగళవారం కూడేరు మండలం బ్రాహ్మణపల్లి, పొట్టిచెరువు గ్రామాల్లో వైయస్ఆర్‌సీపీ నియోజకవర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ప్రజాప్రతినిధులు, అధికారులు,  వైయ‌స్ఆర్‌సీపీ నాయకులతో కలిసి "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామస్తులు వారికి ఘన స్వాగతం పలికారు. ముందుగా లెప్రసి కాలనీలో అనంతరం బ్రాహ్మణపల్లి, పొట్టిచెరువులలో ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, అమలు చేస్తున్న పథకాలను వివరించారు. బుక్‌లెట్‌లు పంపిణీ చేశారు.సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు చెప్పిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ప్రతి ఇంటి వద్ద ప్రజలు వారికి ఘనంగా స్వాగతం పలికారు. గతంలో తాము ఎదుర్కొన్న సమస్యలను, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న మేలును వివరించారు. వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలతో తాము పొందిన లబ్ధి గురించి తెలిపారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top