అనంతపురం: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లా ఉరవకొండకు చేరుకున్నారు. సీఎం వైయస్ జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైయస్‌ఆర్ సీపీ శ్రేణులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. మరికాసేపట్లో వైయస్‌ఆర్ ఆసరా నాల్గవ విడత నిధులను సీఎం వైయస్ జగన్ విడుదల చేయనున్నారు. కంప్యూటర్ బటన్ నొక్కి పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.6,394 కోట్లు జమ చేయనున్నారు. నేడు అందిస్తున్న సాయంతో కలిపి వైయస్‌ఆర్ ఆసరా కింద మొత్తం 4 విడతల్లో రూ.25,571 కోట్ల రుణాలు చెల్లించినట్లు అవుతుంది.