విశాఖ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న‌స్వాగ‌తం

విశాఖ‌ప‌ట్నం: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ చేరుకున్నారు. ఉద‌యం గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌త్యేక విమానంలో బ‌య‌ల్దేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కొద్దిసేప‌టి క్రిత‌మే విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ఘ‌న స్వాగతం పలికారు. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి రుషికొండ పెమ వెల్‌నెస్‌ రిసార్ట్‌కు సీఎం చేరుకోనున్నారు. అక్కడ హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో భేటీ కానున్నారు. 

తాజా వీడియోలు

Back to Top